టాటూ వేయించుకుంటున్నారా? ఒక్కసారి ఇది చదవండమ్మా..

ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ట్రెండ్. వయస్సుతో సంబంధం లేకుండా నచ్చిన టాటూ, నచ్చిన చోట వేయించుకుంటున్నారు. టాటూ తమ అభిరుచులను తెలియజేస్తుందని భావిస్తారు. ట్రెండ్, ఫ్యాషన్ అన్ని కరెక్టేగానీ టాటూ వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్.

Advertisement
Update:2024-05-30 21:49 IST

ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ట్రెండ్. వయస్సుతో సంబంధం లేకుండా నచ్చిన టాటూ, నచ్చిన చోట వేయించుకుంటున్నారు. టాటూ తమ అభిరుచులను తెలియజేస్తుందని భావిస్తారు. ట్రెండ్, ఫ్యాషన్ అన్ని కరెక్టేగానీ టాటూ వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్. శరీరంపై టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు.

 

నిజానికి ఇంజక్షన్ లాగానే టాటూ వేసుకొనేటప్పుడు వాడే నీడిల్ వల్ల సమస్య వస్తుంది అని అనుకుంటాం. నీడిల్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హెపటైటిస్ బి, సి లేదా హెచ్‌ఐవి వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని దేశాల్లో టాటూ వేసుకుంటే బ్లడ్ డోనట్ చేయడానికి కూడా అంగీకరించరు. అయితే తాజా అధ్యయనంలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. పిఎహెచ్‌లతో కూడిన టాటూ ఇంక్‌ను చర్మంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్లరక్త కణాలు ప్రభావితం అవుతాయి. దానివల్ల క్యాన్సర్ చాలా వేగంగా డెవలప్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరం శోషరస వ్యవస్థ(Lymphatic system)లోకి చర్మం ద్వారా చేరిన ఇంక్ కాలేయం, మూత్రాశయం, రక్తాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్ల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.

 

టాటూ లో వాడే ఇంక్ కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, టాటూ ఇంక్ కంపోజిషన్ అనేది ఎవరి నియంత్రణ లోనూ లేదు. దాని వినియోగాన్ని నియంత్రించే ఖచ్చితమైన మార్గదర్శకాలు కూడా లేవు. అందుకే శరీరంపై అందంగా కనిపించాలని చెప్పి టాటూలను వేయించుకోవడం వల్ల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందం, ట్రెండ్ కన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News