వ్యాయామాలు నాలుగు రకాలు! అవేంటంటే..
వ్యాయామాల్లో ఎండ్యూరెన్స్ వర్కవుట్స్, స్ట్రెంతెనింగ్ వర్కవుట్స్, బ్యాలెన్స్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్స్ అని నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాయామాలు ఎంచుకోవాలి.
బరువు తగ్గడం కోసం లేదా నొప్పులు తగ్గడం కోసం.. ఇలా రకరకాల కారణాల కోసం చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వ్యాయామాలన్నీ ఒకే రకంగా పని చేయవని మీకు తెలుసా? వ్యాయామాల్లో ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి. వాటిలో ఏవి ఎందుకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామాల్లో ఎండ్యూరెన్స్ వర్కవుట్స్, స్ట్రెంతెనింగ్ వర్కవుట్స్, బ్యాలెన్స్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్స్ అని నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాయామాలు ఎంచుకోవాలి. అదెలాగంటే..
♦ ఎండ్యూరెన్స్ వర్కవుట్స్: ఇవి లంగ్స్ ఇంకా హార్ట్ కెపాసిటీని పెంచే వ్యాయామాలు. కార్డియో వర్కవుట్స్ అన్నీ ఈ రకానికి చెందినవే. బరువు తగ్గాలనుకునేవారితోపాటు ఆటలు ఆడేవాళ్లు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేవాళ్లు ఈ రకమైన వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది.
♦ స్ట్రెంతెనింగ్ వర్కవుట్స్: ఇవి కండలు పెంచడం కోసం డిజైన్ చేసినవి. జిమ్ వర్కవుట్స్, వెయిట్ ఎక్సర్‌సైజులు ఈ వర్కవుట్స్ కిందకు వస్తాయి. బాడీ షేప్, సిక్స్ ప్యాక్ వంటివి కోరుకునేవాళ్లు ఈ రకమైన వ్యాయామాలను ఎంచుకోవాలి.
♦ బ్యాలెన్స్ ట్రైనింగ్: బ్యాలెన్సింగ్ వ్యాయామాలు శరీరాన్ని మెదడుతో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రకమైన వ్యాయామాలతో నాడీ వ్యవస్థ కూడా చురుకుగా మారుతుంది. అథ్లెట్లతో పాటు వయసు పైబడినవాళ్లకు కూడా ఈ వ్యాయామాలు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి.
♦ ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్స్: శరీరాన్ని సాగదీసే వర్కవుట్స్ ఇవి. కండరాలను, కీళ్లను స్ట్రెచ్ చేయడానికి ఈ రకమైన వ్యాయామాలు పనికొస్తాయి. బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్లతో పాటు ఓవరాల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవాళ్లు కూడా ఈ వ్యాయామాలను ఎంచుకోవచ్చు.
జాగ్రత్తలు మస్ట్
మీకున్న సమస్య లేదా అవసరాన్ని బట్టి సరైన వ్యాయామాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టేముందు డాక్టర్ లేదా ఫిజికల్ ట్రైనర్ సలహా తీసుకుంటే మంచిది.
వ్యాయామాలు చేసే ముందు వామప్ చేయడం చాలాముఖ్యం. ఒకేసారి బాడీని కష్టపెడితే నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వామప్ తో మొదలుపెడితే కీళ్లు, కండరాలు పట్టేయకుండా ఉంటాయి.
వ్యాయామాలను మెల్లగా మొదలుపెట్టి లెవల్ పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి పెద్ద పెద్ద వర్కవుట్స్ చేయడం కంటే చిన్న వర్కవుట్లు ఎక్కువకాలం పాటు చేస్తుండడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి.