ఆన్‌లైన్‌లో వర్కవుట్స్ నేర్చుకోండిలా..

ఫిట్‌నెస్‌లో ఉన్న స్టైల్స్‌కు తగ్గట్టు రకరకాల ఫిట్‌నెస్ క్లాసులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకసారి లాగిన్ అయితే.. మన ఫిట్‌నెస్ లెవల్, ఫిట్‌నెస్ గోల్‌ను బట్టి సరైన వర్కవుట్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

Advertisement
Update:2024-08-02 06:30 IST

యోగా, క్రాస్‌ఫిట్, కార్డియో, వెయిట్ ట్రైనింగ్.. ఇలా ఫిట్‌నెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే ఎవరి స్టైల్‌కు తగ్గట్టు వాళ్లు వర్కవుట్స్‌ చేయాలంటే ఒక ట్రైనర్ ఉండాలి లేదా జిమ్‌కు వెళ్లాలి. ఆ రెండు కుదరని వాళ్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా వర్కవుట్స్ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవీ..

ఫిట్‌నెస్‌లో ఉన్న స్టైల్స్‌కు తగ్గట్టు రకరకాల ఫిట్‌నెస్ క్లాసులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకసారి లాగిన్ అయితే.. మన ఫిట్‌నెస్ లెవల్, ఫిట్‌నెస్ గోల్‌ను బట్టి సరైన వర్కవుట్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

గాయా యోగా (gayayoga.net)

ఆన్‌లైన్‌లో యోగా ట్రైనింగ్ అందించే వాటిలో గాయాయోగా ఒకటి. ఇందులో ఫిట్‌నెస్ లెవల్స్‌ బట్టి రకరకాల సెషన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో హఠ యోగ , అష్టాంగ యోగ, బిగెనర్స్ యోగా.. ఇలా అన్నిరకాల వెరైటీస్ ఇందులో నేర్చుకోవచ్చు. ఇందులో యోగా నేర్పేందుకు చాలామంది ప్రొఫెషనల్ ట్రైనర్లు అందుబాటులో ఉంటారు. వాళ్ల ప్రొఫైల్‌ను బట్టి ఎవరు ట్రైనర్‌‌గా కావాలో కూడా మనమే ఎంచుకోవచ్చు. వీటితో పాటు కోర్, ఫ్లెక్సిబిలిటీ, వెన్నునొప్పులు, కీళ్లనొప్పులు, వెయిట్ లాస్.. ఇలా దేనికోసం యోగా చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆసనాలు ఎంచుకోవచ్చు.

ట్రేసీ ఆండర్సన్(tracyanderson.com)

ట్రేసీ ఆండర్సన్ ప్రపంచంలోని పాపులర్ ఫిట్‌నెస్ ట్రైనర్స్‌లో ఒకరు. ఈమె తన వెబ్‌సైట్ ద్వారా పెయిడ్ ఫిట్‌నెస్ క్లాసుల్ని లైవ్‌లో ఆఫర్ చేస్తోంది. ఇందులో వర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, రిజల్ట్ డ్రివెన్ ప్రోగ్రామ్, ఆన్ లైన్ వర్కవుట్ స్టూడియో.. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇందులో కొన్ని వీడియో లైబ్రరీస్ కూడా ఉన్నాయి. బిగినర్ లెవల్ నుంచి ప్రొఫెషనల్ వరకూ అన్ని రకాల వాళ్లకు తగిన వర్కవుట్ ప్రోగ్రామ్స్ ఇందులో ఉంటాయి.

డైలీ బర్న్(dailyburn.com)

డైలీ బర్న్‌లో రకరకాల డిఫరెంట్ వర్కవుట్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో ఫిట్‌నెస్ లెవల్, ఫిట్‌నెస్ గోల్, స్టైల్‌ను బట్టి రకరకాల కొత్త వర్కవుట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. రెగ్యులర్ వ్యాయామాలతో బోర్ కొట్టకుండా కొత్తకొత్త వెరైటీలు ఈ సైట్ అందిస్తుంది. అవసరాలను బట్టి పర్సనలైజ్డ్ ప్లాన్స్, సర్టిఫైడ్ ఫిట్‌నెస్ ట్రైనర్స్, ఫిట్‌నెస్ లెవల్‌ను పెంచుకుంటూ పోయేలా టైలర్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి.

గ్లో ఫిట్‌నెస్(www.glo.com)

కార్డియో, హై ఇంటెన్సిటీ, పిలాటీస్, కార్డియో కిక్ బాక్సింగ్ లాంటి ఫిట్‌నెస్ వర్కవుట్స్ కోసం గ్లో ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ బెస్ట్ ప్లాట్‌ఫామ్. బాడీ వెయిట్ ట్రైనింగ్, స్పోర్ట్స్ ఫిట్‌నెస్, బూట్ క్యాంప్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ట్రైనర్స్ ఇందులో అందుబాటులో ఉంటారు. ఇందులో ఉండే ప్రోగ్రామ్స్‌లో వర్కవుట్స్‌కు ఎలాంటి ఎక్విప్‌మెంట్ అవసరంలేదు. తేలికపాటి కార్డియో వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడానికి గ్లో ఫిట్‌నెస్ బెస్ట్ ఆప్షన్.

Tags:    
Advertisement

Similar News