వీటితో కాలేయానికి కొవ్వు ముప్పు

ప్రాసెసెడ్‌ మాంసంతో చేసిన ఆహార పదార్థాలు తినడం ప్రమాదకరం అంటున్న ఆరోగ్య నిపుణులు

Advertisement
Update:2024-11-24 14:14 IST

కాలేయానికి కొవ్వు సమస్యను ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఏఎఫ్‌డీ), నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌డీ)గా విభజించారు. ఆహారం, లైఫ్‌స్టైల్‌ కారణంగా ఎన్‌ఏఎఫ్‌డీ వస్తుంది. చల్లని డ్రింక్స్‌, సోడాల్లో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుంటుంది. తరుచూ కూల్‌డ్రింక్స్‌ తీసుకుంటే లివర్‌ వాపు, ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతాయి. అలాగే ప్రాసెసెడ్‌ మాంసంతో చేసిన ఆహార పదార్థాలు తినడం ప్రమాదకరం. వీటిద్వారా లివర్‌కు కొవ్వు పేరుకుపోవడంతో పాటు వాపు వస్తుంది. బర్గర్లు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చికెన్‌ఫ్రైస్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌లో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ శరీరంలో కొవ్వు పేరుకునేలా చేయడంతో పాటు ఇన్సులిన్‌ స్థాయిలను తగ్గిస్తాయి. ఇక మైదాతో చేసిన బ్రెడ్‌, పేస్ట్రిన్‌, రిఫైండ్‌ పిండితో చేసిన పదార్థాలు రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను పెంచుతాయి. ఫైబర్‌ తక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల లివర్‌కు కొవ్వు పట్టడంతో పాటు బరువు పెరుగుతారు. టిఫిన్స్‌లలో రిఫైండ్‌ పప్పులతో చేసిన తీసుకోవడం వల్ల కాలేయానికి హానికరం. షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలూ వస్తాయి. ఐస్‌ క్రీమ్‌లు, అనారోగ్యకరమైన కొవ్వులతో తయారైన మిఠాయిల కారణంగా లివర్‌కు కొవ్వు పేరుకుంటుంది. కాలేయంలోని కణాల్లో అక్సిడేటివ్‌ స్ట్రెస్‌ పెరిగి లివర్‌ డ్యామెజ్‌కి ప్రధాన కారణమౌతుంది. ఫ్రైలు, ఆలూ చిప్స్‌, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ తినడం వల్ల లివర్‌ వాపునకు కారణమవుతాయి. హైబీపీతో పాటు ఇతరత్రా వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు, తృణధాన్యాలు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే కాయగూరలు, ఫ్రూట్స్‌ తీసుకోవాలి. స్మోకింగ్‌, లిక్కర్‌ తీసుకోకుండా ఉంటే లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News