వంటింట్లోనే బోలెడు ఫేస్ ప్యాక్స్

వంటింట్లో వాడే చాలా పదార్థాల్లో ఔషధ గుణాలు ఉంటాయని.. వాటితో ఎంచక్కా ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా వంటల్లో సువాసన కోసం వాడే సుగంధ ద్రవ్యాలన్నీ చర్మాన్ని డీటాక్స్ చేసేవే.

Advertisement
Update:2023-09-10 12:15 IST

వంటింట్లోనే బోలెడు ఫేస్ ప్యాక్స్

వంటింట్లో వాడే చాలా పదార్థాల్లో ఔషధ గుణాలు ఉంటాయని.. వాటితో ఎంచక్కా ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా వంటల్లో సువాసన కోసం వాడే సుగంధ ద్రవ్యాలన్నీ చర్మాన్ని డీటాక్స్ చేసేవే. కాబట్టి చర్మ సౌందర్యం కోసం వాటిని ప్యాక్స్‌గా వాడుకోవచ్చు.

మృదువైన, కాంతివంతమైన చర్మం కోసం కిచెన్‌ స్పైసెస్‌ను వాడి ఫేస్ ప్యాక్స్ ఎలా ట్రై చేయాలో ఇప్పుడు చూద్దాం.

చర్మ ఆరోగ్యానికి దాల్చినచెక్క ఎంతగానో మేలు చేస్తుంది. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి మిశ్రమంగా రెడీ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే చర్మం మృదువుగా మారుతుంది.

వంటింట్లో ఉండే కుంకుమ పువ్వు చర్మ సౌందర్యానికి మంచి మెడిసిన్‌గా పనికొస్తుంది. కాచిన పాలలో కొద్దిగా కుంకుమపువ్వు వేసి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి పట్టించి, ఇరవై నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముఖం మీది చర్మం డీటాక్స్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌తో కొద్ది రోజుల్లోనే ఫేస్‌లో గ్లో వస్తుంది.

వంటింట్లో ఉండే లవంగాలతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. రెండు చెంచాల స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో లవంగాల పొడి వేసి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్లకు ఈ ఫేస్ ప్యాక్ చక్కగా పనికొస్తుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం డీటాక్స్ అయ్యి తాజాగా కనిపిస్తుంది.

వంటింట్లో వాడే యాలకుల్లో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. రెండు స్పూన్ల తేనెలో కొద్దిగా యాలకుల పొడి వేసి దాన్ని ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. స్కిన్ అలర్జీలకు కూడా ఇది మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

ఇక వీటితో పాటు పసుపు, పాలు, పెరుగు వంటి వాటితో కూడా ఫేస్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News