కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి

ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వ్యాధి చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తమగా కంటి శుక్లం ఎక్కువ మంది అంధులవ్వడానికి మొదటి కారణమైతే రెండో సాధారణ కారణం గ్లాకోమా.

Advertisement
Update:2024-02-08 11:00 IST

జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా కళ్లకు సంబంధించిన వివిధ వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. పొగతాగడం, స్క్రీన్‌ టైమ్‌ పెరగడంతో చిన్న వయసులోనే ఏదో ఒక సమస్య బారినపడుతున్నారు. ఇక కంటి చూపుని పోగొట్టి శాశ్వతంగా అంధులుగా మార్చే వ్యాధి గ్లకోమా. ఈ వ్యాధి గుర్తించే లోపే దాదాపు చూపు పూర్తిగా కోల్పోయెంత ప్రమాదకరం అయినది.

ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వ్యాధి చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తమగా కంటి శుక్లం ఎక్కువ మంది అంధులవ్వడానికి మొదటి కారణమైతే రెండో సాధారణ కారణం గ్లాకోమా. ఈ సమస్యలో కంటిలో ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల చూపు కోల్పోతారు. కంటిలో పెరిగిన ఒత్తిడిని ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ అని పిలుస్తారు. నష్టం తీవ్రంగా ఉంటే గ్లకోమా వల్ల శాశ్వతంగా దృష్టిని కోల్పోవచ్చు. అయితే గ్లాకోమా గురించి ప్రజల్లో సరైన అవగాహన ఉండటంలేదు. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా కంటిపరీక్షల ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అయితే మొదట్లోనే దీనిని గుర్తించినట్లయితే.. కంటి చూపును కాపాడుకోవచ్చు.


గ్లకోమా లక్షణాల్లో కంటి వద్ద నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. కళ్లలో నొప్పి కారణంగా తలనొప్పి సమస్య వస్తుంది. వికారం వాంతులు, అస్పష్టమైన దృష్టి, కాంతిని చూడలేకపోవడం, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలుంటాయి. ఆడా ,మగ అనే తేడా లేకుండా ఎవరైనా గ్లకోమాకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి గ్లకోమా వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే.. వారి పిల్లలకి సైతం వచ్చే చాన్స్‌ ఉంటుంది. అలాగే హై బీపీ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడకం, మయోపియా, మైగ్రేన్, అధిక రక్తపోటు, అనీమియా వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు పెంచుతాయి.


రోజువారీ జీవితంలో కొన్ని చర్యలు పాటిస్తే గ్లాకోమా ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. క్రమంగా తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అన్నింటికంటే ముఖ్యమైనది. గ్లకోమాను గుర్తించిన తరువాత వాడటానికి మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మందులు మరింత దృష్టి కోల్పోకుండా సహాయపడాయి. కానీ కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించలేవు.

Tags:    
Advertisement

Similar News