పుల్లని త్రేనుపులను వదిలించుకోవాలంటే..
పుల్లని త్రేనుపు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు, ఆహారం జీర్ణం కాకపోవడం, అన్నవాహికలో పేరుకుపోవడం తో పాటూ చాలా వేగంగా తినడం, త్రాగడం, తినేటప్పుడు మాట్లాడటం, గమ్ నమలడం, కార్బోనేటేడ్ పానీయాలు, పొగ త్రాగడం, ఇవన్నీ జీర్ణక్రియను,పొట్ట యొక్క జీవక్రియ స్థితిని పాడు చేస్తాయి.
జీవనశైలిలో వస్తున్నా మార్పులు, వాటిపై మనం చేస్తున్న అజాగ్రత్త కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అతిగా తినడం, అధిక నూనే వినియోగం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ప్రధాన సమస్యలుగా మారి ఆసుపత్రి పాలయ్యేలా చేస్తే, మరికొన్ని చెప్పటానికి వీలుకాని చిన్న సమస్యగానే ఉంది తరువాత మరో ఆరోగ్య సమస్యకు పునాదిగా మారుతాయి.
సమయానికి ఆహారం తీసుకోకపోవడం వాళ్ళ త్రేన్పులు (Burping) రావటం అనేది సాధారణ విషయం. ఎగువ జీర్ణవ్యవస్థ నుండి అదనపు గాలిని బయటకు పంపడానికి శరీరంలో జరిగే ఓ మార్పు ఇది. అధిక గాలిని మింగడం వల్ల చాలా త్రేన్పులు ఏర్పడతాయి. కానీ, ఇది పుల్లని త్రేన్పులుగా మారినప్పుడు మాత్రం ఆరోగ్య సమస్యకు సంకేతం.
పుల్లని త్రేనుపు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు, ఆహారం జీర్ణం కాకపోవడం, అన్నవాహికలో పేరుకుపోవడం తో పాటూ చాలా వేగంగా తినడం, త్రాగడం, తినేటప్పుడు మాట్లాడటం, గమ్ నమలడం, కార్బోనేటేడ్ పానీయాలు, పొగ త్రాగడం, ఇవన్నీ జీర్ణక్రియను,పొట్ట యొక్క జీవక్రియ స్థితిని పాడు చేస్తాయి. మలబద్దకంతో పాటూ పుల్లని త్రేనుపుకు కారణం కావచ్చు. అలాగే కడుపు లో ఉండే ఆమ్లం పదేపదే అన్నవాహికలోకి తిరిగి ప్రవహించడాన్ని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ రిఫ్లక్స్ అన్నవాహిక లైనింగ్‌ను చికాకుపెడుతుంది. పుల్లని త్రేన్పుల రూపంలో బయటకు వస్తుంది.
నివారించే మార్గాలు
నిదానంగా బాగా నమిలి తినటం, కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేసే కార్బోనేటేడ్ పానీయాలు, బీర్‌లకు దూరంగా ఉండండం మంచిది. అలాగే ధూమపానం పొగను పీల్చినప్పుడు, గాలిని పీల్చుకుని మింగుతారు. దీనివల్ల పుల్లని త్రేనుపు వచ్చే అవకాశం ఉంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే వచ్చే పుల్లని త్రేనుపుకు నిమ్మరసంతో చెక్ పెట్టవచ్చు. పెరుగు కూడా పొట్టకు చల్లదనాన్ని ఇచ్చి సమస్య నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది. అలాగే సోపు, జీలకర్ర తినటం ద్వారా కూడా పుల్లని తేనుపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంగువ జీర్ణక్రియకు ఉత్తమమైనది. గ్యాస్ లేదా పుల్లని తేనుపు సమస్య ఉంటే, నీళ్లలో ఇంగువను కలుపుకుని తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.