షుగర్ ఎక్కువగా తీసుకుంటున్నారా? ఇలా చెక్ చేసుకోండి

శరీరంలో చక్కెర శాతం ఎక్కువైతే ఎన్ని ప్రమాదాలు వచ్చి పడతాయో అందరికీ తెలిసిందే. శరీరంలో చక్కెర ఎక్కువైతే కాలేయంపై ఎఫెక్ట్ పడుతుంది.

Advertisement
Update:2022-11-06 12:00 IST

శరీరంలో చక్కెర శాతం ఎక్కువైతే ఎన్ని ప్రమాదాలు వచ్చి పడతాయో అందరికీ తెలిసిందే. శరీరంలో చక్కెర ఎక్కువైతే కాలేయంపై ఎఫెక్ట్ పడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ పేరుకుపోయి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. చక్కెర ఎక్కువైతే.. అధిక బరువు, కిడ్నీ సమస్యలు, హైబీపీ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎంత షుగర్ తీసుకుంటున్నామో చెక్ చేసుకుంటుండాలి. మన శరీరంలో షుగర్‌ ఎక్కువైందని ఎలా తెలుసుకోవచ్చంటే..

శరీరంలో చక్కెర ఎక్కువైతే అది గ్లూకోజ్‌గా మారుతుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మొటిమలు వస్తుంటాయి. అకస్మాత్తుగా మొటిమలు, విరేచనాలు లాంటివి కనిపిస్తే చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.

షుగర్‌తో కూడిన ఆహారం తీసుకుంటే క్యాలరీలు పెరిగి ఆకలి తగ్గుతుంది. అందుకే ఆకలి తగ్గుతున్నప్పుడు స్వీట్స్ లాంటివి ఎక్కువ తింటున్నారేమో చెక్ చేసుకోవాలి.

షుగర్ ఎక్కువగా ఉండే ఫుఢ్స్ తీసుకుంటే శరీరంలో క్యాలరీలు ఎక్కువ అవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. ఉన్నట్టుండి బరువు పెరగుతుంటే దానికి చక్కెర కూడా కారణమవ్వొచ్చు. కాబట్టి షుగర్ ఇన్‌టేక్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

వైట్‌ షుగర్‌.. సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. అది చిరాకు, అలసటకు దారితీస్తుంది. అందుకే అలాంటి లక్షణాలు కనిపిస్తే చక్కెర ఎక్కువ తింటున్నారేమో చూసుకోవాలి.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవల్స్ తగ్గిపోతాయి. హాయిగా నిద్రపట్టాలంటే మెగ్నీషియం మినరల్ అవసరం. అది లేనప్పుడు నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్లీప్ సైకిల్‌లో మార్పులు గమనిస్తే షుగర్ కంటెంట్ ఎక్కువైందేమో చెక్ చేసుకోవాలి.

ఇకపోతే చాలామంది లావైపోతామని, షుగర్‌ వ్యాధి వస్తుందని.. ఇలా రకరకాల కారణాల వల్ల షుగర్‌‌ను పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు. కానీ శరీరానికి షుగర్ కూడా అవసరమే. అందుకే పండ్లు, పాల ఉత్పత్తుల లాంటివి తీసుకోవాలి. వాటిద్వారా శరీరానికి సహజ చక్కెరలు అందుతాయి. వీటితో ఎలాంటి నష్టం ఉండదు.

Tags:    
Advertisement

Similar News