ఇవి తింటే పొట్ట లైట్‌గా ఉంటుంది!

కడుపు నిండా తిన్నప్పుడు కాస్త బద్ధకంగా, మత్తుగా అనిపించడం సహజం. అందుకే పొట్టను ఎప్పుడూ లైట్‌గా ఉంచుకోవాలి.

Advertisement
Update:2023-06-22 15:13 IST

ఇవి తింటే పొట్ట లైట్‌గా ఉంటుంది!

కడుపు నిండా తిన్నప్పుడు కాస్త బద్ధకంగా, మత్తుగా అనిపించడం సహజం. అందుకే పొట్టను ఎప్పుడూ లైట్‌గా ఉంచుకోవాలి. పొట్ట లైట్‌గా ఉంటే చాలా యాక్టివ్‌గా ఉండొచ్చు. మరి పొట్టను లైట్‌గా ఉంచే ఆహారాలేంటో తెలుసుకుందామా?

చాలామందికి తిన్న వెంటనే బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి పొట్టలో అరగకుండా పడి ఉన్న ఆహారమే కారణం. పొట్ట తేలికగా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని ఫుడ్స్‌ను అవాయిడ్ చేసి మరికొన్ని ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

పొట్ట లైట్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారం వెంటనే జీర్ణమయ్యేలా ఉండాలి. సాధారణంగా పండ్లు, కూరగాయలన్నీ నాలుగైదు గంటల్లో అరిగిపోతాయి. కాబట్టి ఆహారంలో వెజ్జీస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ ఫుడ్స్ అరగడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడతుంది. అందుకే యాక్టివ్‌గా ఉండాలనుకునే వాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిళ్లు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి హెవీ నాన్ వెజ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఆ మరుసటిరోజు కూడా పొట్ట బిగుతుగా అనిపించొచ్చు. కాబట్టి రాత్రిళ్లు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినే అలవాటుని మానుకోవాలి.

పొట్ట లైట్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కార్బో్హైడ్రేట్స్ లేదా ఫైబర్ 70 శాతం, ప్రొటీన్స్ 20 శాతం, ఫ్యాట్స్ 10 శాతం ఉండేలా చూసుకోవాలి. భోజనంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్ లాంటి వాటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇవి తినడం ద్వారా ఎక్కువ శక్తి అందడంతో పాటు పొట్ట లైట్‌గా అనిపిస్తుంది.

పొట్టను తేలికగా ఉంచే ఫుడ్స్‌లో సూప్స్ కూడా ఒకటి. ఇవి అన్నిపోషకాలను అందించడంతోపాటు, పొట్టలో ఎక్కువసేపు నిల్వ ఉండకుండా త్వరగా అరిగిపోతాయి. నూనె లేకుండా వండిన ఆహారాలు, ఉడికించిన ఆహారాలు, పండ్లు లాంటివి త్వరగా అరిగిపోతాయి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినడం ద్వారా కూడా ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News