ఫాస్ట్ లెర్నింగ్‌కు ఈజీ టిప్స్!

ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మెదడు దాన్ని వేగంగా గ్రహించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వీటినే ఫాస్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటారు.

Advertisement
Update:2024-03-16 08:42 IST

కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఎంతలేదన్నా కొన్నిరోజుల టైం పడుతుంది. అలా కాకుండా ‘వేగంగా నేర్చుకోవడం కుదరదా?’ అంటే కుదురుతుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. అదెలాగంటే..

ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మెదడు దాన్ని వేగంగా గ్రహించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వీటినే ఫాస్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటారు. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీప్ శాండ్‌విచ్: ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకోవాలంటే దాన్ని నిద్రతో ముడిపెట్టాలి. దీన్నే ‘స్లీప్ శాండ్‌విచ్’ అంటారు. అంటే నిద్రకు ముందు, నిద్ర తర్వాత ఫోకస్ అంతా అదే విషయంపై పెట్టాలి. అప్పుడు ఆ విషయం త్వరగా బుర్రకెక్కుతుంది. అంటే చదువుతూ లేదా నేర్చుకుంటూ నిద్రపోవాలి. లేదా నిద్ర లేచిన వెంటనే పని మొదలుపెట్టాలి. ఇలా చేస్తే మెదడు త్వరగా దాన్ని గ్రహిస్తుంది.

మిక్స్‌డ్ లెర్నింగ్: ఒకే విషయంపై శ్రద్ధ పెట్టడానికి బదులు రెండు కొత్త విషయాలను కలిపి నేర్చుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది. అంటే రెండు స్కిల్స్‌ను ఒకదానితో ఒకటి లింక్ చేసి నేర్చుకుంటే మైండ్ త్వరగా గ్రహిస్తుందన్న మాట. ఉదాహరణకు టాపిక్స్ చదువుతూ వాటికి సంబంధించిన సర్వేలు చేయొచ్చు. లేదా ఏదైనా విషయం తెలుసుకుంటూ దాన్ని హిస్టరీ లేదా జాగ్రఫీతో ముడి పెడుతూ అర్థం చేసుకోవచ్చు.

టీచింగ్: కొత్త విషయాన్ని ఎదుటివాళ్లకు చెప్పడం ద్వారా త్వరగా నేర్చుకోవచ్చని సైకాలజిస్టులు చెప్తున్నారు. చదవడం, నేర్చుకోవడం కంటే ఎదుటివాళ్లకు చెప్పడం వల్లనే మెదడు ఆ విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తుందట. అయితే ఇక్కడ ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన పని లేదు. కొద్దిగా నేర్చుకున్నప్పటికీ దాన్ని ఫ్రెండ్స్‌కు అర్థమయ్యేలా వివరించగలిగితే అందులో ఉండే లోతైన విషయాలు మెదడు త్వరితగతిన గ్రహిస్తుంది.

చూయింగ్ గమ్: చూయింగ్ గమ్ నమలడం ద్వారా మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు చూయింగ్ గమ్ నమలడం ద్వారా స్ట్రెస్ హార్మోన్లు తగ్గి ఏకాగ్రత పెరుగుతుందట. అలా విషయాన్ని త్వరగా నేర్చేసుకోవచ్చట.

మల్టిపుల్ మెథడ్స్: ఒక విషయాన్ని అనేక పద్ధతుల్లో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే బుక్స్ చదువుతూ, వీడియోలు చూస్తూ, వెబినార్లు వింటూ, అసైన్‌మెంట్స్ లేదా ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూ ఇలా.. రకరకాల పద్ధతుల్లో ఒకే విషయాన్ని నేర్చుకుంటే విషయం త్వరగా ఒంటపడుతుంది.

Tags:    
Advertisement

Similar News