వేగంగా బరువు తగ్గేందుకు డ్రై ఫాస్టింగ్

Dry Fasting For Weight Loss: బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు పాటిస్తుంటారు చాలామంది. ఇందులోకి ఇప్పుడు కొత్తగా మరో డైట్ చేరింది. దానిపేరే డ్రైఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగానే ఇది కూడా ఒకరకమైన ఫాస్టింగ్ టెక్నిక్.

Advertisement
Update:2022-12-27 13:00 IST

వేగంగా బరువు తగ్గేందుకు డ్రై ఫాస్టింగ్

Dry Fasting For Weight Loss: బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు పాటిస్తుంటారు చాలామంది. ఇందులోకి ఇప్పుడు కొత్తగా మరో డైట్ చేరింది. దానిపేరే డ్రైఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగానే ఇది కూడా ఒకరకమైన ఫాస్టింగ్ టెక్నిక్. ఇదెలా ఉంటుందంటే..

ఇటీవలి కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా పాపులర్ అయింది. వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లంతా ఇంటర్మిటెంగ్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నారు. అయితే దీన్ని కాస్త మాడిఫై చేస్తూ డ్రై ఫాస్టింగ్ అనే మరొక ఫాస్టింగ్ టెక్నిక్ పుట్టుకొచ్చింది. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌లో ఉపవాసం చేసే టైంలో నీళ్లు లేదా డికాషన్ వంటివి తీసుకోవచ్చు. అయితే డ్రై ఫాస్టింగ్‌లో వాటిని కూడా తీసుకోకూడదు. పేరులో ఉన్నట్టు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈ ఫాస్టింగ్‌లో సాఫ్ట్‌ డ్రై ఫాస్ట్‌, హార్డ్ డ్రై ఫాస్ట్‌ రెండు రకాలున్నాయి. హార్డ్ ఫాస్టింగ్‌లో అసలు నీళ్ల జోలికేవెళ్లకూడదు. సాఫ్ట్ ఫాస్టింగ్‌లో ఉన్నవాళ్లు బ్రష్ చేసుకోవడం, ముఖం కడుక్కోవడం లాంటి పనులకు నీళ్లు వాడుకోవచ్చు.

ఈ ఫాస్టింగ్ వల్ల లాభామేంటంటే.. నీళ్లు తాగకపోవడం వల్ల శరీరం శక్తిని ఖర్చు చేయడానికి కొవ్వు మీద ఆధారపడుతుంది. నీళ్లు లేకపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు శరీరం శక్తిని అందించే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుంది. అలాగే డ్రై ఫాస్టింగ్‌ వల్ల శరీరంలోని డ్యామేజీ అయిన కణాలు కొత్త కణాలతో భర్తీ అవుతూ ఉంటాయి. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఈ తరహా ఉపవాసాల వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, బరువు త్వరగా తగ్గుతారు.

ఇకపోతే ఎక్కువరోజుల పాటు డ్రై ఫాస్టింగ్‌ చేస్తే నీరసం పెరుగుతుంది. డీహైడ్రేషన్, తలనొప్పి లాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. అందుకే గర్భిణులు, వ్యాధులు ఉన్నవాళ్లు, శారీరక శ్రమ చేసేవాళ్లు ఈ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండడం మేలు. మిగతావాళ్లు కూడా డాక్టర్ సలహా మేరకు ఇలాంటి ఉపవాసాలు పాటిస్తే మంచిది.

Tags:    
Advertisement

Similar News