ఎండాకాలంలో చేయాల్సినవి, చేయకూడనివి

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

Advertisement
Update:2024-04-24 10:58 IST

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. జనాల్లో అవగాహన కోసం పలు సూచనలు చేస్తున్నారు.

చేయాల్సినవి:

* ప్రయాణంలో మంచినీళ్లు వెంట తీసుకెళ్లాలి

* కాటన్‌ దుస్తులు ధరించాలి

* చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి

* ఎండదెబ్బ తగలకుండా క్యాప్‌, గొడుగు, టవల్‌ వాడాలి

* లైట్‌ ఫుడ్‌ తీసుకోవాలి

* తరచూ నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి

* ఎండదెబ్బకు గురైతే ORS లేదంటే లీటరు నీటిలో కొంచెం ఉప్పు, చక్కెర కలుపుకుని తాగాలి

* అత్యవసరం అనుకుంటే త్వరగా హాస్పిటల్‌కు వెళ్లాలి

చేయకూడనివి:

* అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లొద్దు

* నల్లటి దుస్తులు వేసుకోవద్దు

* మద్యం, టీ, కాఫీ ఎక్కువగా తాగొద్దు

* దాహం వేసినప్పుడు కూల్‌డ్రింక్స్‌ తాగొద్దు

* మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తినొద్దు

* చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండలోకి వెళ్లొద్దు

* గుండె జబ్బులు, షుగర్‌, బీపీ ఉన్నవాళ్లు ఎండలో తిరగొద్దు

Tags:    
Advertisement

Similar News