ఫిట్‌గా ఉండాలంటే ఈ మిస్టేక్స్ చేయొద్దు

శరీరం ఫిట్‌గా ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఫిట్‌గా ఉండేవాళ్లకు డయాబెటిస్ , ఒబెసిటీ, బీపీ, స్ట్రెస్ లాంటివి వచ్చే అవకాశం తక్కువ అని స్టడీలు చెప్తున్నాయి.

Advertisement
Update:2023-02-22 15:08 IST

ఫిట్‌గా ఉండాలంటే ఈ మిస్టేక్స్ చేయొద్దు

శరీరం ఫిట్‌గా ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఫిట్‌గా ఉండేవాళ్లకు డయాబెటిస్ , ఒబెసిటీ, బీపీ, స్ట్రెస్ లాంటివి వచ్చే అవకాశం తక్కువ అని స్టడీలు చెప్తున్నాయి. అయితే ఫిట్‌గా ఉండడం కోసం కేవలం ఎక్సర్‌‌సైజ్‌లు చేయడం మాత్రమే కాదు. ఇంకొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అవేంటంటే..

ఒకసారి వర్కవుట్లు మొదలుపెట్టాక రోజూ క్రమం తప్పకుండా చేస్తుండాలి. మధ్యలో బ్రేక్ ఇస్తే..అప్పటివరకూ చేసిందంతా వృథా అవుతుంది. కాబట్టి ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకునేవరకూ వర్కవుట్లు చేయడం మానకూడదు.

వర్కవుట్లు చేయడానికి గంట ముందు తేలికపాటి ఆహారం లేదా జ్యూస్ లాంటివి తీసుకోవాలి. కడుపు నిండా తిని వ్యాయామాలు చేయకూడదు. అలా చేస్తే కండరాలు నొప్పులు, జీర్ణ సమస్యలు లాంటివి వస్తాయి.

కొత్తగా వ్యాయామాలు చేస్తున్న వాళ్లు ముందుగా వార్మప్‌తో మొదలుపెట్ఠాలి.శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగిన తర్వాత మెల్లగా పెద్ద వర్కవుట్లు స్టార్ట్ చేయాలి. వార్మప్ చేయడం వల్ల కండరాలు సాగుతాయి. వర్కవుట్లు చేయడం ఈజీ అవుతుంది.

వ్యాయామాలు చేసేటప్పుడు సరైన అవగాహన పెంచుకోవడం ముఖ్యం. యూట్యూబ్‌లో చూసి చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యం కాని వర్కవుట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే వ్యాయామాలు చేసేటప్పుడు పోశ్చర్, మూవ్‌మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఊపిరి బిగపట్టకుండా శ్వాస నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి.

శక్తికి మించి బరువులు ఎత్తితే నొప్పులు రావొచ్చు. అలాంటప్పుడు వ్యాయామాలను ఆపేయాలి. వర్కవుట్లు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది లేదా నొప్పి లాంటివి వస్తే.. వెంటనే ఆపేయడం బెటర్. అవసరమనుకుంటే ఫిట్‌నెస్ ట్రైనర్ సాయం తీసుకోవాలి.

రోజూ వ్యాయామం చేసేవాళ్లు ఎన్ని క్యాలరీలు ఖర్చువుతున్నాయో లెక్కేసుకుని దానికి తగ్గట్టు క్యాలరీలు తీసుకోవాలి. ఒకసారి ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకున్నాక తేలికపాటి వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ను కంటిన్యూ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News