అసలు మెడనొప్పి ఎందుకొస్తుందో తెలుసా?

ఈ రోజుల్లో మెడనొప్పి అనేది చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్. కొన్ని సర్వేల ప్రకారం ఉద్యోగాలు చేస్తున్నవాళ్లలో దాదాపు 80 శాతం మంది ఒక్కసారైనా మెడనొప్పి సమస్యతో బాధపడినవాళ్లున్నారట.

Advertisement
Update:2024-04-22 08:55 IST

ఈ రోజుల్లో మెడనొప్పి అనేది చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్. కొన్ని సర్వేల ప్రకారం ఉద్యోగాలు చేస్తున్నవాళ్లలో దాదాపు 80 శాతం మంది ఒక్కసారైనా మెడనొప్పి సమస్యతో బాధపడినవాళ్లున్నారట. అసలీ మెడనొప్పి ఎందుకొస్తుంది? దీనికి చెక్ పెట్టే మార్గాలేవి?

వెన్నెమక పైభాగం లేదా మెడకు ఇరువైపులా వచ్చే నొప్పిని మెడనొప్పిగా భావించొచ్చు. అయితే దీనికి పలురకాల కారణాలుంటాయి. గాయం లేదా ప్రమాదాల వల్ల వచ్చేవి అటుంచితే ఎక్కువశాతం మెడనొప్పి సమస్యలు రాంగ్ పోశ్చర్ కారణంగా వస్తున్నాయి. తల బరువుని మోసే బాధ్యత మెడపై ఉంటుంది. అయితే ఆ భారం ఒక్కో పోశ్చర్‌‌లో ఒక్కో విధంగా ఉంటుంది. తలను నిటారుగా ఉంచినప్పుడు మెడపై కొద్దిగా మాత్రమే భారం పడుతుంది. అదే ముందుకి వంచితే మెడ కండరాలు మరింత ఎక్కువగా పనిచేయాలి. అంటే తల బరువు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ బరువుని మెడ మోయాల్సి వస్తుంది. దీనివల్ల క్రమంగా మెడనొప్పి మొదలవుతుంది.

కారణాలివే..

కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం. ముందుకి వంగి పని చేయడం, నిద్రించేటప్పుడు సరైన దిండు వాడకపోవడం, ముందుకి వంగి ఫోన్లను అదే పనిగా వాడడం వంటివి మెడనొప్పి రావడానికి కామన్‌గా ఉండే కారణాలు. వీటితోపాటు శరీరంలో విటమిన్–డి లేకపోవడం, జింక్, క్యాల్షియం లోపించడం కూడా మెడనొప్పి అవకాశాలను పెంచుతాయి.

ఇలా మొదలవుతుంది

మెడనొప్పి ఒకేసారి రావొచ్చు లేదా మెల్లగా మొదలవ్వొచ్చు. అంటే కొందరికి ఒకేసారి మెడ పట్టేసి అది తగ్గడానికి రోజుల సమయం తీసుకుంటుంది. ఇలాంటి వాళ్లు డాక్టర్ల సాయం తీసుకోక తప్పదు. అలాగే కొందరిలో ఉదయం లేవగానే లేదా సాయంత్రం వేళల్లో మెడ నొప్పిగా అనిపిస్తుంది. క్రమంగా అది పెరుగుతూ పోతుంది. ఇలా మెల్లగా మొదలైనవాళ్లు మెడ భంగిమను సరిచేసుకుని మెడ కండరాలను స్ట్రెచ్ చేయడం, ఐస్‌తో కాపడం పెట్టడం ద్వారా నొప్పిని తగ్గించొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

మెడనొప్పి రాకూడదంటే పని చేసేటప్పుడు, పడుకునేటప్పుడు మెడపై భారం పడకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి. మెడను ఎప్పుడూ నిటారుగా ఉంచే ప్రయత్నం చేయాలి.

రోజుల తరబడి మెడనొప్పి వేధిస్తున్నవాళ్లు తప్పక డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్లు సూచించిన ఫిజియోథెరపీ వ్యాయామాలు తప్పక చేయాలి.

పడుకునేటప్పుడు మెత్తటి, తక్కువ ఎత్తు ఉన్న దిండుని వాడాలి. కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

ఇక వీటితోపాటు విటమిన్–డి కోసం ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వడం, క్యాల్షియం, జింక్ లభించేలా రోజూ నట్స్, ఆకుకూరల వంటివి తినడాన్ని అలవాటు చేసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News