ఆహారంలో అయోడిన్ ఎంత ఉండాలో తెలుసా?
శరీరం సక్రమంగా పని చేయడానికి అయోడిన్ అనే మినరల్ చాలా అవసరం. ఇది జబ్బులను తగ్గించడం నుంచి అవయవాల పనితీరు వరకూ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగని అయోడిన్ ఎక్కువైనా కూడా ప్రమాదమే.
శరీరం సక్రమంగా పని చేయడానికి అయోడిన్ అనే మినరల్ చాలా అవసరం. ఇది జబ్బులను తగ్గించడం నుంచి అవయవాల పనితీరు వరకూ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగని అయోడిన్ ఎక్కువైనా కూడా ప్రమాదమే. అసలు ఆహారంలో అయోడిన్ ఎంత ఉండాలంటే..
వంటల్లో రుచి కోసం వాడే ఉప్పులో ఉండేదే అయోడిన్. ఇది మట్టి, సముద్రంలో సహజంగా లభించే మినరల్. ఇది శరీరంలో టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడానికి, మెదడు పనితీరుకి, గుండె ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అత్యతం అవసరం. శరీరంలో అయోడిన్ మోతాదుని బట్టే థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతుంటాయి. శరీరంలో అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. అలాగే అయోడిన్ ఎక్కువైతే.. హైపర్ థైరాయిడిజం వంటి జబ్బులొస్తాయి.
ఒక వ్యక్తికి ఎంత అయోడిన్ అవసరమనేది వయసును బట్టి మారుతుంటుంది. సాధారణంగా ఆరు నెలల్లోపు పిల్లలకు రోజుకి 110 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరం. 7 నుంచి12 నెలల్లోపు పిల్లలకు 130 మైక్రో గ్రాములు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు 90 మైక్రోగ్రాములు, 8 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 120 మైక్రోగ్రాములు, టీనేజ్ పిల్లలకు 150 మైక్రోగ్రాములు, పెద్దవాళ్లకు 150 మైక్రోగ్రాములు., గర్భిణులకు 220 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు 290 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది.
పిల్లల్లో అయోడిన్ లోపిస్తే.. మెదడు ఎదుగుదలలో సమస్యలొస్తాయి. చురుకుదనం లోపిస్తుంది. అయోడిన్ లేకపోతే పెద్దవాళ్లలో జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు అయోడిన్ లోపించడం వల్ల వల్ల థైరాయిడ్ సమస్యలు, గర్భస్రావం, రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదముంది.
అయోడిన్ కోసం ప్యాకెట్ ఉప్పుపై ఆధారపడడం కంటే చేపలు, సీ ఫుడ్, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల వంటివి తీసుకోవడం మేలు. వీటిల్లో సహజమైన అయోడిన్ ఉంటుంది. అయోడైజ్డ్ సాల్ట్‌ను వీలైనంత తక్కువ వాడడం మంచిది.