ఎండల్లో నీరసం రాకుండా ఇలా చేయండి

ఈ సీజన్‌లో శరీరం.. విటమిన్లు, నీటిని త్వరగా పీల్చుకుంటుంది. అందుకే ఎండకు తిరగడం వల్ల శరీరం త్వరగా బలహీనపడుతుంది.

Advertisement
Update:2023-05-23 13:53 IST

సమ్మర్‌లో అలా బయటకు వెళ్లి రాగానే నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం కామన్. ఈ సీజన్‌లో శరీరం.. విటమిన్లు, నీటిని త్వరగా పీల్చుకుంటుంది. అందుకే ఎండకు తిరగడం వల్ల శరీరం త్వరగా బలహీనపడుతుంది. ఈ సీజన్‌లో యాక్టివ్‌గా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే..

సమ్మర్‌లో టైంకి ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. వేగించిన పదార్థాలకు బదులు నీటి శాతం ఎక్కువగా ఉండే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.

సమ్మర్‌లో వేడిగా ఉండే టీ, కాఫీలకు బదులు చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా, నిమ్మరసం, తేనెతో చేసిన డ్రింక్స్ లేదా చెరకు రసం లాంటివి తరచూ తాగుతుండాలి. కనీసం గంటకోసారైనా నీళ్లు తాగుతుండాలి. బయటకు వెళ్లొచ్చినప్పుడల్లా జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి.

సమ్మర్‌లో రోజూ అల్లం, తేనె, నిమ్మరసంతో చేసిన డ్రింక్‌ను పొద్దున్నే తీసుకుంటే నీరసం రాకుండా చూసుకోవచ్చు. నీరసాన్ని తగ్గించడానికి మజ్జిగ కూడా పనికొస్తుంది. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగొచ్చు.

సమ్మర్‌లో శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి. టైంకు నిద్రపోవాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తపడాలి.

Tags:    
Advertisement

Similar News