కొత్తిమీర టీ గురించి తెలుసా?

కొత్తిమీర టీ తాగడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల సమస్యలు తగ్గుతాయి.

Advertisement
Update:2024-03-02 11:15 IST

ఈ మధ్యకాలంలో హెర్బల్ టీలు చాలా పాపులర్ అవుతున్నాయి. రుచి, సువానసతో పాటు ఆరోగ్యాన్ని అందించడం వీటి ప్రత్యేకత. అలాంటి స్పెషల్ హెర్బల్ టీల్లో కొత్తిమీర టీ ఒకటి. దీన్నెలా తయారుచేయాలి? దీంతో ఉండే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీరలో ‘ఎ’, ‘సి’, ‘కె’ విటమిన్లతో పాటు ఐరన్, క్యాల్షియం వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో టీ చేసుకుని తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉంటే వెంటనే తగ్గుతాయి. సువాసనభరితమైన కొరియాండర్ టీ ఎలా చేయాలంటే..

కొరియాండర్ టీ తయారుచేయడానికి ఒక కప్పు కొత్తిమీర ఆకులు, కొద్దిగా పసుపు ఉంటే చాలు. ముందుగా పాత్రలో నీళ్లు పోసి మరిగేటప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొత్తిమీర తరుగు వేయాలి. మూడు నిమిషాలు మరిగిన తర్వాత టీ నుంచి సువాసనలు వస్తాయి. దాన్ని కప్‌లోకి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ టీ రెడీ. ఇందులో రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. లేదా తేనె, నిమ్మరసం వంటివి కూడా కలుపుకోవచ్చు. అలాగే లవంగం, దాల్చినచెక్క, స్టార్ ఫ్లవర్.. ఇలా నచ్చిన స్పైస్‌తో ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ చేయొచ్చు.

లాభాలివే..

కొత్తిమీర టీ తాగడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే హై క్యాల్షియం కంటెంట్ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు, కొత్తిమీర టీ బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఈ టీని తీసుకోవచ్చు.

ఇకపోతే కొత్తిమీరలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ కొత్తిమీర టీ తాగడం ద్వారా చర్మంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో వేసే పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది.

కొత్తిమీర శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే నోటి అల్సర్లు, పగుళ్లు, నోటి దుర్వాసనతో బాధపడేవాళ్లకు కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News