పెరుగుతున్న కళ్లకలక కేసులు.. జాగ్రత్తలు ఇలా..

కళ్లకలక వచ్చిందని తెలుసుకునేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. కంటి నుంచి అదేపనిగా నీరు కారుతుంటుంది.

Advertisement
Update:2023-08-04 17:00 IST

దేశంలో కొన్ని రోజులుగా కంళ్లకలక కేసులు కలవరపెడుతున్నాయి. బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకగలదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇంట్లో ఒకరికి కళ్లకలక వస్తే మిగతా అందరికీ కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లో ఎవరికి కళ్ల కలక వచ్చినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లకలక వచ్చినవాళ్లు ఇంట్లోనే ఉంటూ తగిన విశ్రాంతి తీసుకోవాలి. కళ్లకలక అంత ప్రమాదమైనది కాదు. కానీ కళ్లల్లో విపరైతమైన నొప్పి, దురద వంటివి వేధిస్తాయి. మందులు వాడితే వారం లేదా పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినొచ్చు.

లక్షణాలు ఇలా..

కళ్లకలక వచ్చిందని తెలుసుకునేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. కంటి నుంచి అదేపనిగా నీరు కారుతుంటుంది. కంటిరెప్పలు ఉబ్బి కన్ను వాచినట్టు ఉంటుంది. కళ్లల్లో నలుసు పడినట్టుగా అనిపిస్తుంది. దేన్నీ సరిగా చూడలేరు. అలాగే కళ్లకలక వచ్చినప్పుడు జ్వరం, గొంతునొప్పి కూడా రావొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

కళ్లకలక సోకినట్టు గుర్తిస్తే.. వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించాలి.

కళ్లను తరచూ తాకకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది.

కళ్లమంట నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్లు ఇచ్చిన మందులు తప్పక వాడాలి. కళ్లకు గోరువెచ్చటి కాపడం పెట్టాలి.

కంటిని తరచుగా నీటితో కడుక్కుంటుండాలి. నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు హెల్దీ డైట్‌ పాటించాలి.

కళ్లకలక ఉన్న వాళ్లను చూడడం ద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తుందనేది అపోహ అంటున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుతుందని చెప్తున్నారు.

ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పడు జనంలో తిరగొద్దు వీలైనంతగా ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. కళ్లకలక వచ్చిన వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తపడొచ్చు.

Tags:    
Advertisement

Similar News