వెదురు బియ్యంతో బరువు తగ్గొచ్చా?

వెదురు బియ్యంలో క్యాలరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బరువును తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

Advertisement
Update:2022-09-21 15:30 IST

ఈ మధ్యకాలంలో వరిబియ్యంతో పాటు చాలా రకాల రైస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటే వెదురు బియ్యం. పొట్టిపొట్టి గింజలు ఉండే ఈ రైస్ చాలా అరుదైన రకం. ఈ బియ్యంతో వండిన అన్నం తినడం ద్వారా ఎన్నోరకాల పోషకాలతో పాటు బరువు కూడా తగ్గొచ్చని డాక్టర్లు చెప్తున్నారు.

వరి మొక్కల లాగానే వెదురు చెట్ల నుంచి కూడా బియ్యం వస్తాయి. వెదురు చెట్లకు పూత వచ్చి, కంకులు కడతాయి. అయితే వెదురు మొక్క ఎంతో అరుదుగా పూస్తుంది. ఈ వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తింటే శరీరంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది. విటమిన్‌ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు ఇందులో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వెదురు బియ్యంతో డయాబెటిస్, బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

వెదురు బియ్యపు గింజలు పొడవు తక్కువగా ఉంటాయి. వీటిని అన్నం, దోశె, ఇతర వంటకాల్లో వాడుకోవచ్చు. ఈ రైస్ తినడం ద్వారా శరీరంలోని విషపదార్థాలను బయటకుపోతాయి. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల వెదురు పిలకలను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. వెదురు పిలకల్లో ఫైబర్ , ప్రోటీన్లతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి మినరల్స్, రైబోఫ్లెవిన్‌, ఏ, కే, ఈ, బీ6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్‌, ఫైటోన్యూట్రియంట్స్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వెదురు బియ్యంలో క్యాలరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బరువును తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నాడీసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. గర్భిణీలు వీటిని తినడం వల్ల కాన్పు తేలికవుతుందని నిపుణులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News