గర్భాశయ క్యాన్సర్‌‌ను ముందే గుర్తించండిలా

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ క్యాన్సర్‌‌ను ముందే పసిగట్టడం ద్వారా ప్రమదాన్ని నివారించొచ్చు.

Advertisement
Update:2022-10-06 14:57 IST

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ క్యాన్సర్‌‌ను ముందే పసిగట్టడం ద్వారా ప్రమదాన్ని నివారించొచ్చు. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఆడవాళ్లలో వచ్చే పిరియడ్స్ సమస్యలు, రక్తస్రావం లాంటివాటిని చాలామంది చాలా తేలికగా తీసుకుంటుంటారు. అలాగే నెలసరి సమస్యలకు ఏవేవో మందులు వాడేస్తుంటారు. వీటివల్లే దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

మనదేశంలో ఎక్కువ

గర్భాశయ క్యాన్సర్ ముఖ్యంగా 15 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండే ఆడవాళ్లకి ఎక్కువగా వస్తుంటుంది. మనదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య దాదాపు 6 నుంచి 29 శాతం వరకూ ఉంది. అందులో గర్భాశయ క్యాన్సర్‌‌తో భాధపడుతున్నవాళ్ల సంఖ్య ఎక్కువని పలు మెడికల్ రిపోర్టులు చెప్తున్నాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ పిడియాట్రిక్ ఆంకాలజీ ప్రకారం.. మనదేశంలో ఒక్క 2019 సంవత్సరంలోనే 35 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో 60,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడి మరిణించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌‌కు సంబంధించి సరైన అవగాహన లేకపోవడమే దీనికి ముఖ్య కారణం. నెలసరి సమస్యలు, రక్తస్రావం, పీసీఓఎస్ లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా క్యాన్సర్ ఉంటే దానివల్ల కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను ముందుగా గమనించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.

జాగ్రత్తలివీ

వయసు 30 ఏండ్లు దాటుతున్న మహిళలందరూ తప్పకుండా ఆరునెలలకు లేదా సంవత్సరానికోసారి గర్భాశయానికి సంబంధించిన చెకప్స్ చేయించుకోవాలి.డాక్టర్లు ఏదైనా తేడా గుర్తిస్తే వెంటనే స్కానింగ్ వంటివి తీయించుకోవాలి. దీనివల్ల సమస్యను ముందుగానే గమనించే అవకాశం ఉంటుంది. మామూలుగా గర్భాశయ క్యాన్సర్ అనేది పపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. హెచ్ పివీ 16, 18 వల్ల ఈ గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందకనే 30 ఏళ్లు పైబడిన స్త్రీలు ప్రతి మూడేళ్ళకు ఒకసారి పాప్ స్మెర్ పరీక్ష చేయించుకోవడం వల్ల గర్భాశయంలో మార్పులను ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. ఇక వీటితో పాటు యోనిలో మంట, దురద, తరచుగా అలసట, డిస్యూరియా, మూత్రం ఆపుకోలేకపోవడం, పొట్ట ఉబ్బరం లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌‌ను కలవడం మంచిది.

Tags:    
Advertisement

Similar News