కళ్ళు మండుతున్నాయా? అయితే ఇలా చేయండి!
కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, పొల్యూషన్ లో ఎక్కువగా తిరగడం, పోషకాల లోపం, డీహైడ్రేషన్, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి.
కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, పొల్యూషన్ లో ఎక్కువగా తిరగడం, పోషకాల లోపం, డీహైడ్రేషన్, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి. కళ్ళ మంటలు ఎక్కువైతే తలనొప్పి, కళ్లనుంచి నీరుకారడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది మరీ ఎక్కువైతే కంటి చూపు తగ్గే ప్రమాదం కూడా ఉంది. మరి కళ్ళ మంటలను తగ్గించుకోడానికి ఏం చేయాలి?
కంప్యూటర్ల ముందు గంటల తరబడి పని చేసే వాళ్ళు స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ ని తగ్గించడానికి రీడింగ్ గ్లాసెస్ వంటివి వాడాలి. అలాగే మానిటర్ లో బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేస్తే కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కళ్ళ మంటలు తగ్గుతాయి.
తరచూ కళ్ళు మండుతుంటే కీరదోస ముక్కల్ని రోజూ కాసేపు కళ్లపై పెట్టుకోవాలి. కీరా లేదా గ్రీన్ టీ బ్యాగు, రోజ్‌వాటర్‌లో ముంచిన దూదిని కూడా వాడుకోవచ్చు.
వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేడిని తగ్గించి కళ్లను చల్లబరుస్తాయి.
కళ్ళ మంటను తగ్గించడంలో బంగాళదుంప కూడా అద్భుతంగా పని చేస్తుంది. బంగాళదుంపని గుండ్రంగా కట్ చేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.ఆ తర్వాత వాటిని తీసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ మంటలు తగ్గుముఖం పడతాయి.
బాదం నూనె లేదా నెయ్యిని కాటుకలా పెట్టుకోవడం ద్వారా కూడా కళ్ళ మంటలను తగ్గించొచ్చు.ఇవి కంటి లోని నాళాలను ప్రేరేపించి కళ్లల్లో ఉండే దుమ్ము, ధూళి వంటి వాటిని బయటకు వచ్చేలా చేస్తాయి.
అలాగే కళ్ళు మంటలు పుడుతున్నప్పుడు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి గ్యాడ్జెట్స్‌ను పక్కన పెట్టేయాలి. కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
అలాగే చల్లటి నీటితో తరచూ కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా కళ్ళు రిలాక్స్ అవుతాయి.