బ్రెస్ట్ క్యాన్సర్‌.. కొన్ని అపోహలు

మామోగ్రామ్ స్క్రీనింగ్‌కి, మామోగ్రామ్ టెస్టుకు చాలా తేడా ఉంటుంది. స్క్రీనింగ్ చేసే సమయంలో ఎక్స్‌‌రే తక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టి చేయడం వల్ల కొన్ని సార్లు తప్పుడు రిపోర్టులు వస్తుంటాయి.

Advertisement
Update:2022-10-19 17:31 IST

క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. మనిషి శరీరంలోని ఏ అవయవానికి సోకితే దాన్ని ఆ పేరుతో పిలుస్తుంటారు. మనం తరచూ బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) గురించి వింటుంటాము. అయితే ఈ వ్యాధికి సంబంధించి చాలా మంది ఎన్నో అపోహలు కలిగి ఉంటారు. ఎక్కడో చదివో, ఎవరో చెబితేనో అవే నిజమని నమ్ముతుంటారు. అయితే వాటిలో నిజాలేమిటో అబద్దాలేమిటో కాస్త వివరంగా చెప్పుకుందాము.

1. ప్రతీ నెల రొమ్ములను సొంతగా పరీక్షించుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ నుంచి కాపాడుకోవచ్చు.

- తప్పు. ప్రతీ నెల ప్రతీ నెల పరీక్షించుకోవడం వల్ల రొమ్ము క్యానర్స్ నుంచి రక్షించబడలేదు. అంతే కాకుండా ఎర్లీ స్టేజ్‌లో ఉన్న వ్యాధిని కూడా గుర్తించలేరు.

2. మామోగ్రామ్ స్క్రీనింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడుతుంది.

- తప్పు. మామోగ్రామ్ స్క్రీనింగ్‌కి, మామోగ్రామ్ టెస్టుకు చాలా తేడా ఉంటుంది. స్క్రీనింగ్ చేసే సమయంలో ఎక్స్‌‌రే తక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టి చేయడం వల్ల కొన్ని సార్లు తప్పుడు రిపోర్టులు వస్తుంటాయి. కొన్ని సార్లు స్క్రీనింగ్‌లో పాజిటివ్ వచ్చిన వాళ్లకు బయాప్సి చేస్తే నెగెటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి స్క్రీనింగ్ సమయంలో క్యాన్సర్ ఉన్నట్లు తేలినా భయపడాల్సిన పని లేదు.

3. మామోగ్రామ్ తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది.

- పాక్షికంగా నిజం. మామోగ్రఫీ టెస్టు ద్వారా క్యాన్సర్ ఉనికి తెలుసుకోవచ్చు. రెండు రొమ్ములను స్కానింగ్ ట్రాక్‌ల మధ్య ఉంచి.. బ్రెస్ట్‌లో పెరుగుతున్న క్యాన్సర్ కణాల కోసం తనిఖీ చేస్తారు. ఇది చాలా బాధకరమైన టెస్ట్ అని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ కాస్త ఇబ్బంది పెడుతుందేమో కానీ.. తీవ్రమైన నొప్పి మాత్రం ఉండదు.

4. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుంది.

- తప్పు. రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే వస్తుందనేది అపోహ మాత్రమే. పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో 5 నుంచి 10 శాతం పురుషులే ఉంటున్నారు.

5. బ్రెస్ట్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర వల్ల కూడా వస్తుంది.

- పాక్షికంగా నిజం. జన్యుపరంగా సంక్రమించే వ్యాధులు చాలా ఉన్నాయి. వాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే ఇతర జన్యు సంబంధిత వ్యాధుల్లాగా అందరికీ సంక్రమించదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది ఈ వ్యాధి రావొచ్చు. అయితే కుటుంబంలో ఎవరికీ రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోయినా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

6. డియోడరెంట్స్, పెర్ఫ్యూమ్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.

- తప్పు. డియోడరెంట్స్, పెర్ఫ్యూమ్స్ వల్ల ఎవరైనా అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. అంతే కాని బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా టెక్సాస్‌లోని నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ దీనిపై విస్తృత పరిశోదనలు చేసి డియోడరెంట్, పెర్ఫ్యూమ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది.

7. రొమ్ము క్యాన్సర్ కేవలం వయసు మళ్లిన వారి మాత్రమే వస్తుంది.

- తప్పు. రొమ్ము క్యాన్సర్ కేవలం వయసు మళ్లిన వారికి మాత్రమే వస్తుందనేది అపోహ. టీనేజ్ యువతీ యువకులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే యవ్వనంలో ఉన్న వారు కోలుకోవడానికి ఎక్కువ అవకాశం మాత్రం ఉంటుంది.

8. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ట్యూమర్లు ఏర్పడతాయి.

- తప్పు. రొమ్ము క్యాన్సర్ బారిన పడే అందరికీ ట్యూమర్లు ఏర్పడాలనే నియమం ఏమీ లేదు. రొమ్ములో ఎలాంటి గడ్డలు లేకపోయినా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. అలాగే గడ్డలు ఉండి నొప్పి లేకపోయినా రొమ్ము క్యాన్సర్ అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.

9. రొమ్ముక్యాన్సర్ ఓ అంటు వ్యాధి.

- తప్పు. రొమ్ము క్యాన్సర్ అనేది మన శరీర కణాజాలం అసాధారణంగా పెరగడం వల్ల వస్తుంది. అంతే కానీ సూక్ష్మ జీవుల వ్ల సోకే వ్యాధి కాదు. కాబట్టి రొమ్ము క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరి సోకే అంటు వ్యాధి కాదు.

10. పేషెంట్లందరికీ ఒకటే చికిత్స.

- తప్పు. క్యాన్సర్ రోగులందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. క్యాన్సర్ కణాలు ఎంత మేరకు వ్యాపించాయనే దానిని బట్టి ఎలాంటి చికిత్స అందించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. కొంత మందిలో కీమో థెరపీతో క్యాన్సర్ నయం అవుతుంది. మరి కొందరిలో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది. మరి కొంత మందికి రొమ్ము మొత్తం తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

11. ప్రమాదవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు.

- తప్పు. ఏదైనా ప్రమాదం జరిగి రొమ్ములకు గాయాలు అయినా, దెబ్బలు తగిలినా క్యాన్సర్ సోకుతుందనే అపోహ మాత్రమే.

Tags:    
Advertisement

Similar News