దోమల ద్వారా వచ్చే డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ?

సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరం అంతా దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ఇది ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement
Update:2024-07-19 15:50 IST

వానాకాలంలో సీజనల్ వ్యాధులు మనపై దాడి చేస్తాయి. తేమ వాతావరణంలో బాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు వేగంగా వృద్ధి చెందడంతో మెదడు, నాడీ సంబంధ సమస్యలు పెరుగుతాయి. అలాగే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి కూడా ఇదే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండకపోతే ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు దారి తీయచ్ఛని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇన్‌ఫెక్షన్‌ సోకిన మొదటి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు.

సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరం అంతా దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ఇది ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని వైద్యులు పేర్కొన్నారు.


డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ గా పేర్కొనే ఈ సమస్య వల్ల తీవ్రమైన ప్లాస్మా లీకేజీ ఏర్పడుతుంది. దాని వల్ల  మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని, ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్‌ ముప్పు ఉంటుందని వెల్లడించారు. అంతే కాదు డెంగ్యూ వైరస్‌ కొన్నిసార్లు నరాల కణాలను ఆక్రమించి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. మెదడు, వెన్నెముకలో వాపు ఏర్పడి కణజాలం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ..

సాధారణంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని వల్ల స్ట్రోక్ వస్తుంది. సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ముఖంలో కొంత భాగం ముడుచుకుపోవడం లేదా తిమ్మిరిగా అనిపించవచ్చు.


ఒక చేయి బలహీనంగా లేదా తిమ్మిరిగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక మాటల్లో స్పష్టత లేకపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య చికిత్స తప్పనిసరి. అలాగే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, మైకం కమ్మేయడం, బ్యాలెన్స్ కోల్పోవడం, దృష్టి సమస్యలు, గందరగోళం, ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవడం వంటివి కూడా జరగవచ్చు. లక్షణాలు కనిపించిన తరువాత ఎంత త్వరగా వైద్య సహాయం పొందితే అంత మంచిది.

Tags:    
Advertisement

Similar News