ఈ అలవాట్లతో బ్రెయిన్ షార్ప్ అవుతుంది!

బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసినప్పుడే ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. అయితే ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్న స్ట్రెస్, యాంగ్జయిటీల వల్ల రానురాను మెదడు పనితీరు దెబ్బ తింటోంది.

Advertisement
Update:2024-08-16 11:30 IST

బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసినప్పుడే ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. అయితే ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్న స్ట్రెస్, యాంగ్జయిటీల వల్ల రానురాను మెదడు పనితీరు దెబ్బ తింటోంది. దాన్ని తిరిగి రీస్టోర్ చేయాలంటే కొన్ని కొత్త అలవాట్లు అవరచుకోవాలి.

శారీరక ఆరోగ్యం కోసం ఎలాగైతే ఎక్సర్‌‌సైజులు చేస్తుంటామో మానసిక ఆరోగ్యం కోసం కూడా కొన్ని మెంటల్ ఎక్సర్‌‌సైజులు చేయాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

మెడిటేషన్: మానసిక ఒత్తిడి, టెన్షన్, యాంగ్జయిటీ వంటివాటిని తగ్గించడానికి మెడిటేషన్ మంచి టూల్‌గా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం పది నుంచి ఇరవై నిముషాల పాటు మెడిటేషన్ చేస్తే మంచిది. రిలాక్స్‌డ్ పొజిషన్‌లో కూర్చొని లోతైన శ్వాసలు తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు.

బుక్ రీడింగ్: రోజూ ఓ ఇరవై నిముషాల పాటు ఏదైనా పుస్తకం చదవడం ద్వారా మెదడు రిలాక్స్ అవుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. పుస్తకం వల్ల కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, బుక్ రీడింగ్ అనేది ఒక ఎక్సర్‌‌సైజ్‌లా కూడా పనిచేస్తుంది. ఇరవై నిముషాల పాటు ఒకే విషయంపై శ్రద్ధ ఉంచడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది.

మ్యూజిక్: రోజూ కాసేపు ఏ పనిచేయకుండా కేవలం సంగీతం వినడం ద్వారా చాలా గొప్ప రిజల్ట్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. తేలికపాటి మ్యూజిక్ వినడం ద్వారా మెదడు పూర్తిగా రిలాక్స్ అవ్వడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రెండో చేతిని వాడడం: రోజువారీ పనులు చేసుకునేటప్పుడు ఎక్కువగా వాడే చేతిని కాకుండా వాటం లేని చేతిని వాడడం ద్వారా మెదడుకి కొత్త పని చెప్పినట్టు అవుతుంది. ఈ అలవాటు ద్వారా మెదడుకి ఎక్సర్‌‌సైజ్ అవుతుంది. క్రియేటివిటీ, మెమరీ పవర్ పెరుగుతాయి.

ఇక వీటితోపాటు పజిల్ పూర్తి చేయడం, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, ఆటలు ఆడడం వంటి యాక్టివిటీస్ ద్వారా కూడా బ్రెయిన్ షార్ప్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News