శీతాకాలంలో ఆరోగ్యం కోసం..

శీతకాలంలో మన శరీరానికి విటమిన్ డి అవసరం ఉంటుంది కాబట్టి, బయట సూర్యరశ్మిని ఆస్వాదించే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Update:2023-10-30 13:20 IST

చలికాలం వచ్చిందంటే ముసుగు తియ్యాలి అనిపించదు. చక్కగా అలారం ఆపేసి దుప్పటి కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుండే తప్ప కనీస వ్యాయామం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఎక్కడ లేని బద్దకం ఒంటిమీద వచ్చి చేరుతుంది. అలా అని ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతామా అంటే అదీ లేదు.. అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని ఏవేవో సమస్యలు.

నిజానికి శీతాకాలం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఒక ముఖ్యమైన అంశం. రోజువారీ దినచర్య గా యోగా, లేదా ఏదైనా కాస్త వ్యాయామం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఫ్లూ, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుంచి రక్షణ కలిగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక శీతకాలంలో మన శరీరానికి విటమిన్ డి అవసరం ఉంటుంది కాబట్టి, బయట సూర్యరశ్మిని ఆస్వాదించే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మనం పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతారు. తృణ ధాన్యాలు, మాంసం, చేపలు, చిక్కుడు గింజలు, తాజా కూరగాయలు, తాజా పండ్లను, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల సలహా. ఇది మన వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ఎంత చలికాలం అయినా సరే, శరీరానికి తగినంత మొత్తంలో నీరు త్రాగాలి. నీరు మన వ్యవస్థను శుభ్రపరచడానికి, వ్యర్థాలను తొలగించడానికి, శరీర కణాలకు పోషకాలను అందించడానికి, శరీర ద్రవాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

శీతాకాలంలో చర్మ సమస్యలు విపరీతం. చల్లటి వాతావరణం చర్మాన్ని దెబ్బతీస్తుంది, దీని ఫలితంగా చర్మం పొడి బారడం, దురద, పెదవులు, పాదాల పగుళ్ల సమస్య వుంటుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ క్రీములను వాడాలి.

ఇక శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి నిద్ర పోవడం కూడా చాలా అవసరం. మంచి నిద్ర శరీర రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అని, ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.అలాగే చల్లగా ఉంది కదా అని పరిశుభ్రతను గాలికి వదిలేయకుండా ఎప్పటికప్పుడు శరీరాన్ని శుభ్రం చేసుకోవటం, వేసుకొనే దుస్తులను శుభ్రం చేసుకోవటం, బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాప్తి చెందకుండా చూసుకోవటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    
Advertisement

Similar News