అసలు పొట్ట ఎందుకు పెరుగుతుందంటే..

ఈ రోజుల్లో పొట్ట అనేది చాలామందికి పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా పొట్ట పెరగకుండా ఆపలేరు.

Advertisement
Update:2024-06-14 19:46 IST

ఈ రోజుల్లో పొట్ట అనేది చాలామందికి పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా పొట్ట పెరగకుండా ఆపలేరు. ఒకసారి పొట్ట పెరిగిందంటే తిరిగి దాన్ని తగ్గించడానికి చాలానే తంటాలు పడాల్సి వస్తుంది. అందుకే అసలు పొట్ట ఎందుకు పెరుగుతుందో కారణాలు తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

పొట్ట పెరగడానికి నాలుగు బేసిక్ కారణాలు ఉంటాయి. ఎవరికైనా ఈ నాలుగు కారణాల వల్లే పొట్ట పెరుగుతుంది. కాబట్టి వీటిని సరిచేసుకుని తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ పొట్ట పెరగదు.

పొట్ట పెరగానికి మొదటి కారణం శారీరక శ్రమ లేకపోవడం. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా.. రోజుకి కొన్ని క్యాలరీలైనా కరిగించకపోతే క్రమంగా పొట్ట పెరగడం మొదలవుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్లకు మరింత త్వరగా పొట్ట పెరుగుతుంది. కాబట్టి ఇలాంటివాళ్లు కొద్ది పాటి శారీరక శ్రమ అయినా ఉండేలా చూసుకోవాలి.

పొట్టకు మరో కారణం హార్మోన్ల ఇంబాలెన్స్. హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోతే ఒత్తిడి పెరిగి మెటబాలిజంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇది క్రమంగా పొట్ట పెరిగేలా చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల పొట్ట మాత్రమే కాదు, క్రమంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి హార్మోన్ల ఆరోగ్యం కోసం సమతులాహారం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ఇక మూడో కారణం ఫైబర్ తీసుకోకపోవడం. తీసుకునే ఆహారంలో ఫైబర్‌‌కు బదులు ఫ్యాట్, హై క్యాలరీ ఫుడ్స్ వంటివి ఎక్కువగా ఉంటే అవి క్రమంగా కొవ్వు నిల్వలుగా మారతాయి. కాబట్టి పొట్ట రాకూడదు అనుకునేవాళ్లు షుగర్, జంక్ ఫుడ్ తగ్గించాలి. రోజువారీ డైట్‌లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.

ఇకపోతే కొంతమందికి జీర్ణ సమస్యల వల్ల కూడా పొట్ట వస్తుంది. తిన్న ఆహారం సరిగాజీర్ణమవ్వకపోవడం, గ్యాస్ట్రిక్‌ సమస్యల వల్ల పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఇలాంటి పొట్టను తగ్గించాలంటే.. తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవాలి. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

Tags:    
Advertisement

Similar News