చర్మ ఆరోగ్యం కోసం ఆయుర్వేదం!

క్రీములు, ఫేస్ ప్యాక్‌ల వంటి కెమికల్ ట్రీట్మెంట్స్‌కు బదులు ఆయుర్వేద విధానం ద్వారా చర్మ సౌందర్యాన్ని సులభంగా మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Advertisement
Update:2023-08-07 16:46 IST

చర్మ ఆరోగ్యం కోసం ఆయుర్వేదం!

క్రీములు, ఫేస్ ప్యాక్‌ల వంటి కెమికల్ ట్రీట్మెంట్స్‌కు బదులు ఆయుర్వేద విధానం ద్వారా చర్మ సౌందర్యాన్ని సులభంగా మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. చర్మ ఆరోగ్యం, సౌందర్యం కోసం ఆయుర్వేదంలో రకరకాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే..

ఆయుర్వేదం ప్రకారం చర్మ ఆరోగ్యానికి, నీటికి దగ్గరి సంబంధం ఉంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. లోపలి నుంచి చర్మం ఎంత హైడ్రేటెడ్‌గా ఉంటే బయటకు అంత తాజాగా కనిపిస్తుందని ఆయుర్వేదం చెప్తోంది.

ఆయుర్వేదం ప్రకారం చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడం కోసం మర్దన లేదా మసాజ్ అనేది ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. స్వచ్ఛమైన నూనెలను తీసుకుని ముఖంపై, శరీరంపై మృదువుగా మర్దన చేయడం ద్వారా చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మసాజ్ ద్వారా చర్మం త్వరితగతిన మెరుపు సంతరించుకుంటుంది.

చర్మాన్ని క్లెన్సింగ్ లేదా శుభ్రం చేసుకోవడం కోసం పసుపు, చందనం లేదా శనగపిండిని వాడమని ఆయుర్వేదం చెప్తోంది. ఇవి చర్మానికి కావల్సిన పోషకాలను అందించి, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. తద్వారా చర్మం ఎప్పడూ మృదువుగా, సున్నితంగా ఉంటుంది.

ముఖం తాజాగా ఉండడం కోసం ముఖంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడం అవసరం. దీనికోసం ఆయుర్వేదం ఆయిల్ పుల్లించ్ చేయమని చెప్తోంది. ఆయిల్ పుల్లింగ్ అంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తీసుకుని నోటిలో పుక్కిలించి పట్టుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీది చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడడంతో పాటు దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం చర్మానికి ఎలాంటి సమస్య వచ్చినా మూలికల ద్వరా నయం చేసుకోవచ్చు. కలబంద, మందారం, పుదీనా, వేప వంటి ఆయుర్వేద మూలికలతో చర్మాన్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ మూలికల్లో కొన్నింటిని తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఫేస్‌కు ప్యా్క్‌లా వేసుకుంటే ఎలాంటి చర్మ సమస్య అయినా తగ్గుముఖం పడుతుంది.

ఇక వీటితోపాటు చర్మ సౌందర్యం కోసం పండ్లు, తాజా ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం ముఖ్యం. ఇవి చర్మాన్ని లోపలి నుంచి డీటాక్స్ చేస్తూ.. ఎప్పటికప్పుడు చర్మాన్ని తేమగా ఉంచడంతో సాయపడతాయి.

Tags:    
Advertisement

Similar News