తరచూ కళ్లు తిరుగుతున్నాయా? ఇది తెలుసుకోండి!
అలసట, తరచూ కళ్లు తిరగడం, మగతగా అనిపించడం వంటి లక్షణాలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని లైట్‌గా తీసుకుంటారు. అలసిపోవడం వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల అనుకుంటారు. కానీ, వీటికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు.
అలసట, తరచూ కళ్లు తిరగడం, మగతగా అనిపించడం వంటి లక్షణాలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని లైట్‌గా తీసుకుంటారు. అలసిపోవడం వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల అనుకుంటారు. కానీ, వీటికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మగవారితో పోలిస్తే ఆడవాళ్లలో కళ్లు తిరిగే సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. తరచూ కళ్లు తిరగడం, అలసట వంటివి రక్తహీనత, వర్టిగో వంటి సమస్యలకు లక్షణాలు కూడా అయ్యి ఉండొచ్చు. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.
తల తిరగడం అనేది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన సిగ్నల్ కూడా అవ్వొచ్చు. రక్త హీనత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంటుంది. కాబట్టి తరచూ ఈ లక్షణాలు కనిపిస్తున్నవాళ్లు తప్పకుండా డాక్టర్‌ను కలిసి టెస్ట్ లు చేయించుకుంటే మంచిది. రక్తహీనత లేదా ఎనీమియా ఉన్నవాళ్లు డైట్‌లో ఆకు కూరలు, ద్రాక్ష, నువ్వులు, రాగులు, బెల్లం వంటి ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఎనీమియా తగ్గేలా చూసుకోవచ్చు.
ఇక వర్టిగో విషయానికొస్తే.. ఇది కళ్లు తిరగడానికి భిన్నంగా ఉంటుంది. కనిపిస్తున్న పరిసరాలన్నీ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా నిలబడలేరు. శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. మెదడు, నరాలు లేదా చెవిలోపల ఏదైనా సమస్య ఉంటే ఇది సంభవిస్తుంది. ఇందులో మైకం, వికారం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొన్నిసార్లు తల లోపల గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాన్ని సబ్జెక్టివ్ వర్టిగో అంటారు. అలాగే వర్టిగోలో మెనియర్స్ డిసీజ్, వెస్టిబ్యులార్ మైగ్రేన్, వెస్టిబ్యులార్ న్యూరనైటిస్ వర్టిగో, పొజిషనల్ వర్టిగో వంటి పలు రకాలున్నాయి.
వర్టిగో సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా బయట తిరగకూడదు. బరువులు ఎత్తకూడదు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. అలాగే వీలైనంత త్వరగా డాక్టర్‌ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.