ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటున్నారా?
ఎప్పుడూ యాక్టివ్‌గా, హుషారుగా పనిచేయాలంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, సాల్ట్స్‌ను ఎలక్ట్రోలైట్స్ అంటారు.
ఎప్పుడూ యాక్టివ్‌గా, హుషారుగా పనిచేయాలంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, సాల్ట్స్‌ను ఎలక్ట్రోలైట్స్ అంటారు. అయితే సమ్మర్‌లో చెమట ద్వారా ఈ ఎలక్ట్రోలైట్స్ శాతం తగ్గిపోతుంటుంది. అందుకే వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరానికి కావల్సిన క్లోరైడ్, పొటాషియం, సోడియం, క్యాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజలవణాలను ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి శరీరానికి చార్జింగ్‌నిస్తాయి. మజిల్స్‌ను యాక్టివ్‌గా ఉంచుతాయి. ఇవి తగ్గిపోతే నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సమ్మర్‌లో వీటిని ఏరోజుకారోజు బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. మినరల్స్ పొందడం కోసం సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..
సమ్మర్ లో బయట తిరిగేవాళ్లు, చెమట ఎక్కువగా పట్టే శరీరతత్వం ఉన్నవాళ్లు ప్రతిరోజూ మినరల్స్ ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. కొబ్బరినీళ్లతో ఎలక్ట్రోలైట్స్‌ను ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. ఇది సమ్మర్‌లో నేచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది.
నిమ్మరసంతో కూడా ఎలక్ట్రోలైట్స్ రీస్టోర్ అవుతాయి. సమ్మర్‌లో నిమ్మరసం ఇన్‌స్టంట్ ఎనర్జీనిస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. నిమ్మరసంలో పొటాషియం, మెగ్నీషియంతోపాటు విటమిన్–సీ కూడా ఉంటుంది.
సమ్మర్‌లో ఎక్కువగా దొరికే పుచ్చకాయలతో కూడా ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు శరీరాన్ని ఇన్‌స్టంట్‌గా ఛార్జ్ చేస్తాయి. ఇదొక్కటే కాదు, సమ్మర్‌లో దొరికే కర్భూజ, మామిడి, తాటి ముంజలతో కూడా ఎలక్ట్రోలైట్స్‌ను రీప్లేస్ చేయొచ్చు.
సమ్మర్‌లో బయట తిరిగేవాళ్లు దాహం తీర్చుకోవడం కోసం కూల్‌డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. అయితే వీటి ద్వారా హై క్యాలరీలు, షుగర్స్ తప్ప ఎలాంటి మినరల్స్ అందవు. కాబట్టి వీలైనంత వరకూ కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలను తీసుకోవాలి. అవి అందుబాటులో లేనప్పుడు షాపుల్లో దొరికే ఓఆర్‌ఎస్ డ్రింక్స్ తాగొచ్చు.
ఇకపోతే డైట్‌లో ఆకు కూరలు ఉండేలా చూసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ అందుతాయి. ఆకుకూరల్లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.