పుచ్చకాయ గింజలతో ఎన్ని లాభాలో తెలుసా?

పుచ్చకాయ తిని వాటి గింజలు పారవేస్తున్నట్టయితే మీరు చాలా బెనిఫిట్స్ మిస్సవుతున్నట్టే.

Advertisement
Update:2024-03-22 08:00 IST

వేసవి వచ్చిందంటే ఇళ్లల్లో పుచ్చకాయలు కనిపిస్తుంటాయి. వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు పుచ్చకాయలు తినడం మంచి అలవాటు. అయితే కేవలం కాయలు మాత్రమే కాదు, వాటి విత్తనాలతో కూడా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా? పుచ్చకాయ గింజల్ని పారవేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి.

పుచ్చకాయ తిని వాటి గింజలు పారవేస్తున్నట్టయితే మీరు చాలా బెనిఫిట్స్ మిస్సవుతున్నట్టే. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అవేంటంటే..

 

పుచ్చకాయ గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్‌తో పాటు పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు.

పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. పైగా ఇందులో ఉండే క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లకు పుచ్చగింజలు ఎంతో మేలు చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇవి చర్మాన్ని కూడా తేమగా, మృదువుగా ఉంచడంతో సాయపడతాయి. పుచ్చగింజల నుంచి తీసిన నూనెను పలురకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో కూడా వాడతారు.

పుచ్చకాయ గింజల్లో ఉండే పోషకాలు సమ్మర్‌‌లో కామెర్ల సమస్యను నిరోధిస్తాయి. అలాగే ఇవి కిడ్నీల ఆరోగ్యానికి కూడా మంచివి. సమ్మర్‌‌లో వేడి చేయకుండా, యూరిన్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.

పుచ్చకాయ గింజలతో ఇన్ని లాభాలున్నాయి. కాబట్టి ప్రతిఒక్కరూ వాటిని పారవేయకుండా ఏదో రూపంలో తీసుకోవడం మంచిది. వీటిని కాయతోపాటే నేరుగా తినేయొచ్చు. లేదా సలాడ్స్, ఓట్స్‌తో కలిపి తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే పుచ్చ గింజలను ఎండబెట్టి వాటిని పొడిచేసి వాటితో టీ తయారుచేసుకోవచ్చు. లేదా పాన్‌పై కాల్చి కూడా తినొచ్చు.

Tags:    
Advertisement

Similar News