ఉప్పు... చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్‌, జర జాగ్రత్త మరి

బ్రాండ్ లతో సంబంధం లేకుండా మన దేశంలో వాడే ఉప్పు, చక్కరల్లో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Advertisement
Update: 2024-08-14 04:15 GMT

బ్రాండ్ లతో సంబంధం లేకుండా మన దేశంలో వాడే ఉప్పు, చక్కరల్లో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. టాక్సిక్స్‌ లింక్‌ అనే పర్యావరణ హిత సంస్థ విడుదల చేసిన ‘మైక్రోప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ నివేదికలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.



వంటింట్లో ఉండే అతి ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి ఉప్పు అయితే మరొకటి చక్కెర. ఈ రెండింటిలో ప్రతీ సందర్భంలోనూ మనిషి ఆహారంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాలి. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది. చిన్నాపెద్ద, ప్యాక్‌డ్‌, అన్‌ప్యాక్‌డ్‌ అన్న తేడాలేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది.

టేబుల్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌, సీ సాల్ట్‌, రా సాల్ట్‌తో పాటు మొత్తం పది రకాల ఉప్పు, చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన మట్టిబెడ్డలు, ఫైబర్‌, ఫిల్మ్స్‌ బయటపడ్డాయని నివేదిక వెల్లడించింది. ఇక అయోడైజ్‌డ్‌ ఉప్పులో అత్యధికంగా రకరకాల ఫైబర్‌, ఫిల్మ్‌ మైక్రోప్లాస్టిక్స్‌ , ఆర్గానిక్‌ ఉప్పులో అత్యల్పంగా 6.70 మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు,కనిపించాయని తెలిపింది. ఈ లెక్కన ఒక కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు ఉంటున్నాయని వివరించింది. అలాగే చక్కెర నమూనాలలో, మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రత కిలోగ్రాముకు 11.85 నుండి 68.25 ముక్కల వరకు ఉంటుందని తెలిపింది.

దీని బట్టి చూస్తే మైక్రోప్లాస్టిక్‌లు మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె పై ప్రభావం చూపుతాయి. అలాగే మానవ అవయవాలపై, తల్లి పాల ద్వారా పుట్టబోయే పిల్లలపై ఎఫెక్ట్ చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి.

Tags:    
Advertisement

Similar News