హైబీపీతో హై అలర్ట్

అధిక ర‌క్త‌పోటు నిశ్శ‌బ్ధంగా హైప‌ర్‌టెన్ష‌న్ భార‌త యువ‌జ‌నాభాను త‌న గుప్పిట్లోకి తీసుకుంటోంది. మారుతున్న జీవ‌న శైలి, నిద్ర‌లేమి, ఒత్తిడి వంటివి యువ‌త‌ను హైబీపీ బారిన‌ప‌డ‌వేస్తున్నాయి.

Advertisement
Update:2024-02-13 17:43 IST

అధిక ర‌క్త‌పోటు నిశ్శ‌బ్ధంగా హైప‌ర్‌టెన్ష‌న్ భార‌త యువ‌జ‌నాభాను త‌న గుప్పిట్లోకి తీసుకుంటోంది. మారుతున్న జీవ‌న శైలి, నిద్ర‌లేమి, ఒత్తిడి వంటివి యువ‌త‌ను హైబీపీ బారిన‌ప‌డ‌వేస్తున్నాయి.

ఏదైనా భయానికి గురికావడమో లేదా ఆతృత వంటి సమయాల్లో హైపర్ టెన్షన్‌ వేధిస్తుంటుంది. దీంతో శరీరంలో ఉన్నపలంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ సమయంలో శరీరం రక్తాన్ని పంప్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో రక్త నాణాలపై ఒత్తిడి పెరగడం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి. దీంతో శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్‌ కొరతకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇదే గుండెపోటుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.



బీపీని స‌కాలంలో గుర్తించి నియంత్ర‌ణ‌లో ఉంచుకోకుంటే అది స్ట్రోక్‌, గుండెపోటు, గుండె వైఫ‌ల్యం, కిడ్నీ వైఫ‌ల్యం స‌హా ఇత‌ర అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ కూడా హెచ్చ‌రిస్తోంది.

దీన్ని ప్రాథమికంగా గుర్తించడం కాస్త కష్టంగా ఉంటుంది. చాలా మందిలో పెద్దగా లక్షణాలు కూడా కనిపించవు. అందుకనే దీన్ని సైలెంట్‌ కిల్లర్ అనీ అంటుంటారు. సమస్య ఎక్కువ అయిన తర్వాత ఇది బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే.. కొందరిలో ఉదయాన్నే తలనొప్పి తల తిరగటం కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే కళ్లు సరిగ్గా కనిపించక పోవడం కూడా అధిక రక్త పోటు లక్షణం. శరీరంలో రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.


ఛాతీలో నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా మనసులో ఏదో తెలియన దడ. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఏ మాత్రమూ అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఒక్కోసారి ప్రాణ హానిని కూడా కలిగించేంత ప్రమాదకరమైనవి కావొచ్చు.

అధిక రక్త పోటును తొందరగా గుర్తిస్తే చికిత్సలు ప్రారంభించడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ప్రతీరోజూ కచ్చితంగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల మంచి నీటిని తాగాలి. వీటి అన్నింటితో పాటూ ఉప్పు వాడకం తగ్గించాలి. ఊరగాయ పచ్చళ్లు పక్కన పెట్టేయాలి. అలాగే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News