ఆర్ఎస్ఎస్ నిక్కర్ కి నిప్పు.. బీజేపీ కస్సుబుస్సు..

రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Advertisement
Update:2022-09-12 15:43 IST

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వేసుకున్న టీషర్ట్ విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నిక్కర్ ని టార్గెట్ చేసింది. ఖాకీ నిక్కర్ కు మంటలు అంటుకున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను కాంగ్రెస్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వల్ల జరుగుతున్న నష్టాలను ఆపేసేందుకు.. ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ల‌క్ష్యాన్నిచేరుకోబోతున్నట్టుగా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాలిపోతున్న ఖాకీ నిక్కర్ కింద '145 డేస్ టు గో' అనే క్యాప్షన్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇంకా 145 రోజులు మిగిలి ఉందని, బీజేపీ ముక్త భారత్ కి కూడా ఇంకా 145 రోజులే టైమ్ ఉందన్నట్టుగా సింబాలిక్ గా క్యాప్షన్ పెట్టారు. దీంతో సహజంగానే బీజేపీకి మంటపెట్టినట్టయింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీ నిక్కర్ కు ఎందుకు నిప్పుపెట్టాల్సి వచ్చిందంటూ నిలదీస్తున్నారు.

అది భారత్ తోడో యాత్ర..

రాహుల్ గాంధీ చేస్తోంది భార‌త్ జోడో యాత్ర కాదని, అది భార‌త్ తోడో యాత్ర అని.. ఆగ్ ల‌గావో యాత్ర అని ఆరోపిస్తున్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఖాకీ నిక్కర్ కి నిప్పంటించిన ఫొటోని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటినుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కొక్కరే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. యాత్ర మొదలైన తొలివారంలోనే ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News