ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలి
దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Advertisement
వెలమ సామాజిక వర్గం వారిని అసభ్య పదజాలంతో దూషించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దోమలగూడ పోలీస్ స్టేషన్‌లపై ఎమ్మెల్యే శంకర్ పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషిస్తూ వెలమ కులస్తుల అంతుచూస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అహంకారపూరితంగా ఒకవర్గంపై ఇలాంటి దూషణలు, బెదిరింపులు సరికాదని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement