పంటపొలంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

అడవి పందులు పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్‌తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Advertisement
Update:2025-02-20 11:47 IST

నిజామాబాద్‌ జిల్లా పెగడపల్లిలోని పంట పొలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రేచల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన ఉర్సు గంగారాం, కుమారుడు కిషన్‌, భార్య బాలమణి అడవి పందులు పట్టడానికి పంటల పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్‌తీగలు తగిలి ముగ్గురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టమార్టం కోసం బోధన్‌ ఆస్పత్రికి తరలించారు. 

Tags:    
Advertisement

Similar News