సీఎంఆర్‌ కాలేజీ ఇష్యులో మరో ఇద్దరు అరెస్ట్

సీఎంఆర్ కాలేజీ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు

Advertisement
Update:2025-01-05 16:26 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ సీఎంఆర్‌ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఏ1 నంద కిషోర్ కుమార్, ఏ2 గోవింద్ కుమార్‌ను అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఏ3గా ధనలక్ష్మి, ఏ4గా అల్లం ప్రీతిరెడ్డి, ఏ5గా ప్రిన్సిపల్‌ అనంత నారాయణ, ఏ6గా కాలేజి డైరెక్టర్‌ మద్దిరెడ్డి జగన్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

తమను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిశోర్‌, గోవింద్‌ లపై ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్‎లో విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరణ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాత్ రూమ్‎లో ఫోన్ పెట్టి తమ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారంటూ విద్యార్థినులు రోడ్డెక్కడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‎గా తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News