కస్టడీ లో నేరాన్ని ఒప్పుకున్న వీరరాఘవరెడ్డి

చిలుకూరు ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో నేటితో ముగియనున్నప్రధాన నిందితుడి కస్టడీ

Advertisement
Update:2025-02-20 11:25 IST

చిలుకూరు ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో మొయినాబాద్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా.. రేపు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీరరాఘవరెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. దాడి చేయడానికి కారణాలతో పాటు ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలను వెల్లడించాడని పోలీసులు తెలిపారు. గతంలో తన కుమార్తెను పాఠశాల నుంచి డిటెన్షన్‌ చేయడంతో పోలీస్‌ స్టేషన్‌, కోర్టుకు వెళ్లానని కానీ ఎక్కడా తనకు న్యాయం జరగలేదని తెలిపాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓ సాధువు కలిసి జ్ఞానోదయం కలిగించాడని తెలిపాడు. తన న్యాయం జరగకపోవడంతో సాధువు చెప్పినట్లు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. దీని కోసం రామరాజ్యం ఏర్పాటునకు సైన్యాన్ని తయారు చేస్తున్నానని, గోషలింద ట్రస్ట్‌ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై అన్యాయం కేసులు పెట్టాని వీరరాఘవ రెడ్డి చెప్పాడు. 

Tags:    
Advertisement

Similar News