అప్పుల బాధతో కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి
పురుగుల మందు తాగిన దంపతులు, కూతురు మృతి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు పరిస్థితి విషమం
Advertisement
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో విషాదం నెలకొన్నది. అప్పుల బాధతో మంగళవారం పురుగుల మందు తాగిన కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు. భార్యభర్తలు మొండయ్య, శ్రీదేవితో పాటు కుమార్తె చైతన్య చనిపోగా.. కుమారుడు శివప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయి.. చేసిన అప్పులు చెల్లించలేక పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం కూలిడ్రింగ్‌లో విష రసాయం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటి నుంచి అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు 108 సమాచారం ఇచ్చారు. వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు.. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Advertisement