న్యూ ఆర్టీన్స్ ఘటనలో విదేశీ శక్తుల కుట్ర లేదు
తేల్చిన వైట్‌హౌ్‌స్ వర్గాలు
నూతన సంవత్సరం వేళ అమెరికా సైన్యం మాజీ ఉద్యోగి వాహనంతో జరిపిన దాడిలో 15 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశంలోని అత్యున్నత భద్రత అధికారులతో అధ్యక్షుడు జో బైడెన్ సుమారు గంటపాటుచర్చించి వివరాలు తెలుసుకున్నారు. విచారణ జరుగుతున్న తీరును ఎప్‌బీఐ ఆయనకు వివరించింది. అనంతరం స్వదేశీ, విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని బైడెన్ తెలిపారు. న్యూ ఆర్లీన్స్ ఘటన ఆ దేశంలో కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో విదేశీ శక్తుల కుట్ర లేదని వైట్ హౌస్ వర్గాలు తేల్చాయి.లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద సంఖ్యలో జనం అక్కడ సెటబ్రేట్ చేసుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (IS) నుండి ప్రేరణ పొందిన వ్యక్తి అక్కడికి వెళ్లి దాడి చేయడంతో పదిహేను మంది మరణించగా.. సుమారు 35 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.నిందితుడిని ఆర్మీ వెటరన్ షంసుద్-దిన్ జబ్బార్ (42)గా గుర్తించారు. సిరియాలోని అమెరికా మిలటరీ బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయిని, మళ్లీ పుంజుకోకుండా ఐసిస్ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నామని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.