లేడీ కానిస్టేబుల్‌ను నరికి చంపిన సొంత తమ్ముడు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య జరిగింది

Advertisement
Update:2024-12-02 12:14 IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. లేడీ కానిస్టేబుల్‌ని సొంత తమ్ముడు నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే రాయపోల్‌కు చెందిన నాగమణి.. హయత్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె హయత్‌నగర్‌లోనే ఉంటున్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో.. భర్తతో కలిసి రాయపోల్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం బైక్‌పై డ్యూటీకి వెళ్తున్న ఆమెను.. కారుతో వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు ఎండ్లగూడ వద్ద ఢీకొట్టారు. అనంతరం ఆమెను కత్తితో తల, మెడపై నరికి చంపి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్‌ ప్లేటు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పీటాల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కులాంతర పెళ్లి చేసుకోవడంతో ఆమెది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులే హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆమె సోదరుడు పరమేశ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తరుచుగా పరువు హత్యలు జరుగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News