చోరీ చేసి పారిపోతూ వంతెన పైనుంచి దూకిన దొంగ
చోరీ చేసి పారిపోతూ ఓ దొంగ ఫ్లై ఓవర్ నుంచి కిందకు దూకాడు. ఈ ఘటన అంబర్‌పేటలో చోటు చేసుకుంది.
Advertisement
హైదరాబాద్ అంబర్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీద నుంచి ఓ దొంగ ఒక్కసారిగా కిందకు దూకాడు. మద్యం మత్తులో ఉన్న ఫలక్‌నుమాకు చెందిన రాములు వంతెన పైన ఉన్న ఇనుప రాడ్లను చోరీ చేసేందుకు యత్నించాడు. దానిని గుర్తించిన కూలీలు గట్టిగా కేకలు వేయడంతో ఫ్లైఓవర్ పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.
Advertisement