సెలవులు ప్రకటించిన సీఎంఆర్‌ కాలేజీ యాజమాన్యం

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు చిత్రీకరణ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

Advertisement
Update:2025-01-03 12:25 IST

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ సీఎంఆర్‌ కాలేజీలో హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు చిత్రీకరించరంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. హాస్టల్‌ వార్డెన్‌ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 12 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించింది. మరోవైపు కాలేజీ యాజమాన్యం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌ నుంచి తమను వీడియో తీశారంటూ మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ సీఎంఆర్‌ కాలేజీ ఐటీ క్యాంపస్‌ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగగా ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు, బీజేవైఎం నేతలు మద్దతు పలకడంతో గురువారం పరిస్థితి మరింత వేడెక్కింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేసింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కమిషన్‌ కార్యదర్శి పద్మజారమణ హాస్టల్‌కు వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు.

Tags:    
Advertisement

Similar News