బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్.. తీర్పుపై ఉత్కంఠ
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు
Advertisement
సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనున్నది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. 'పుష్ప2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణఖు హాజరయ్యారు. అదేరోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement