లోయలో పడిన ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి

ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు

Advertisement
Update:2025-01-04 15:36 IST

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపూర్‌ జిల్లాలో ఆర్మీ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్‌ 24న కూడా ఓ ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

కాగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News