జీడిమెట్ల కెమికల్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
Advertisement
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్ధానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. భారీగా పొగలు, మంటలు రావడంతో గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను అర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘటనపై పోలీసులు గోడౌన్ లో షాట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమా? లేక మరేదైన ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్ లో ఎవరైనా ఉన్నారా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement