నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌

కోర్టుకు బెయిల్‌ పూచీకత్తు సమర్పించనున్న నటుడు

Advertisement
Update:2025-01-04 12:38 IST

సినీ నటుడు అల్లు అర్జున్‌ కాసేపట్లో నాంపల్లి కోర్టు రానున్నారు. కోర్టులో బెయిల్‌ పూచీకత్తు సమర్పించనున్నారు. నాంపల్లి కోర్టు జడ్జి ముందు పత్రాలు అందించనున్నారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను నిన్న మంజూరు చేసిన విషయం విదితమే. రూ. 50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం (రెండు నెలల పాటు) చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. 

Tags:    
Advertisement

Similar News