అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్
మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని కోర్టు షరతులు విధించింది. పుష్పా -2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేణుక అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీతేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో చిక్కపడపల్లి పోలీసులు ఏ11గా అల్లు అర్జున్ ను చేర్చారు. ఆయనను అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదే రోజు సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా అప్పటికే పొద్దుపోవడంతో ఒక రాత్రి చర్లపల్లి జైలులో అల్లు అర్జున్ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం విడుదలయ్యారు. రూ.50 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.