కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది దుర్మరణం
పంజాబ్‌లోని భటిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Advertisement
పంజాబ్‌లోని భటిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం తల్వండీ సాబో నుంచి భటిండా నగరం వైపు వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన తెలిపారు.
గాయాలపాలైన మరో 18 మందికి షహీద్ భాయ్ మణిసింగ్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. జీవన్ సింగ్ వాలా గ్రామస్తులు చొరవచూపి కాల్వలో పడిన వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలను ఇంకా గుర్తించలేదని తెలుస్తోంది.
Advertisement