తెలుగు యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

తెలుగు యూట్యూబర్ “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్‌కు విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది

Advertisement
Update:2025-01-10 19:27 IST

తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు భారీ షాక్ తగిలింది. ఫన్ బకెట్ భార్గవ్‌కు విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికను గర్భవతిని చేశారంటూ ఫన్ బకెట్ భార్గవ్‌ మీద కేసు నమోదైంది. ఈ కేసులో భార్గవ్‌ను దోషిగా తేల్చిన విశాఖపట్నం పోక్సో కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్‌ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు.

దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది. ​ విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్‌.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Tags:    
Advertisement

Similar News