సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరిన పోలీసులు
Advertisement
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 12న ఇచ్చిన షోకాజ్ నోటీస్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ నోటీసులు ఇచ్చారు. పుష్ప -2 ప్రీమియర్ షో సందర్భంగా ఈనెల 4న రాత్రి 9.40 గంటలకు తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ కోమాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సినిమా హీరో అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించడంతోనే క్రౌడ్ అదుపుతప్పి తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
Advertisement